ఆ హీరో దెబ్బకు వాంతులు .. సెట్‌లోనే బలవంతంగా, హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా షూటింగ్‌లు అంత తేలికైన విషయం కాదు. ఎన్నో వ్యయ, ప్రయాసలతో పాటు ఎందరినో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్క షాట్ తీయాలంటే ఎంతో కష్టం.. డైరెక్టర్‌కు కావాల్సిన విధంగా రావడం సింగిల్ టేక్‌లో జరగకపోవచ్చు. అయితే షూటింగ్ స్పాట్‌లలో కొన్నిసార్లు అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. అవి ప్రమాదాలు కావొచ్చు, లేదంటే నటీనటుల మధ్య మనస్పర్ధలు కావొచ్చు. ఏం జరిగినా చిత్రీకరణపై ప్రభావం చూపుతుంది. అలా తన కెరీర్‌లో జరిగిన ఓ అనుభవాన్ని పంచుకున్నారు బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్.

బాలీవుడ్ నిర్మాత రవి టాండన్, వీణ టాండన్‌ల గారాలపట్టి రవీనా. ముంబైలోనే చదువుకున్న ఆమె 1991లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తొలి చిత్రంతోనే సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం కొట్టేశారు అదే పట్హేర్ కే ఫూల్. ఆ తర్వాత జీనా మర్నా టేరే సేంగ్, దివ్యశక్తి, క్షత్రియ వంటి సినిమాల్లో నటించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. రథసారథి అనే తెలుగు చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రవీనా టాండన్‌కు ఆ సినిమా అంతగా బ్రేక్ ఇవ్వలేదు.

Bollywood senior actress raveena tandon made sensational comments on star hero

ఈ క్రమంలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ సరసన ఆమె నటించిన బంగారు బుల్లోడు సినిమా రవీనాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలోని స్వాతిలో ముత్యమంత సాంగ్‌లో తన అందాలతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది రవీనా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ తెలుగులో ఆమెకు అవకాశాలు అంతగా రాలేదు.. దీంతో తిరిగి బాలీవుడ్‌పై రవీనా ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో సాధు అనే తమిళ్ సినిమాతో కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు రవీనా టాండన్.

కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర స్వయంగా దర్శకత్వం వహించిన ఉపేంద్ర సినిమాలో హీరోయిన్‌గా నటించి మరోసారి తన అందాలతో ఊపేసింది. 2001లో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ఆకాశ వీధిలో చిత్రంతో మరోసారి తెలుగువారిని పలకరించారు రవీనా. దాదాపు 13 ఏళ్ల తర్వాత మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నటించిన పాండవులు పాండవులు తుమ్మెదలో కనిపించి అలరించింది . ఇక ఇటీవల కేజీఎఫ్ చాప్టర్‌లో కీలకపాత్ర పోషించిన రవీనా తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో మెప్పించింది. ప్రస్తుతం వెల్‌కమ్ టూ జంగిల్, జాలీ ఎల్ఎల్‌బీ సినిమాలలో ఆమె నటిస్తున్నారు. 50 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు రవీనా టాండన్.

Bollywood senior actress raveena tandon made sensational comments on star hero

ఇదిలాఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఓ సినిమా షూటింగ్ సమయంలో తనతో ఓ హీరో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. సీన్ ప్రకారం తనపై బలవంతం చేయాల్సి ఉందని.. ఆ సమయంలో హీరో పెదాలు నా పెదాలకు తగిలాయని , సీన్‌లో ముద్దు పెట్టాలని లేకపోయినా అలా తప్పు జరిగిందని రవీనా తెలిపారు. దీంతో తాను చాలా ఇబ్బంది పడ్డానని.. కడుపులో వికారంగా తిప్పేయడంతో తీసుకోలేకపోయానని వెంటనే వాష్‌రూమ్‌లోకి వెళ్లి వాంతులు చేసుకున్నానని రవీనా టాండన్ పేర్కొన్నారు.

ఓ వంద సార్లు బ్రష్ చేసుకున్నానని ఆమె గుర్తుచేశారు. సదరు హీరోకి ఎలాంటి దురుద్దేశం లేదని.. పొరపాటున జరగిందని , దీంతో ఆయన నాకు క్షమాపణలు చెప్పాడని రవీనా అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇంతకీ రవీనాను ముద్దు పెట్టుకున్నా ఆ హీరో ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X