భర్తను వదిలేసి మరొకరితో స్టార్ హీరోయిన్ డేటింగ్.. ఆ విషయంలో సంతృప్తి లేకనే..!

రూపా గంగూలీ.. ఈ పేరు చెబితే గుర్తు పట్టే వాళ్లకంటే కూడా.. మహా భారత్ సీరియల్ లో ద్రౌపదిగా కనిపించిన అమ్మాయి అంటే మాత్రం అంతా ఇట్టే గుర్తు పడతారు. ఈ సీనియర్ స్టార్ హీరోయిన్ బెంగాలీకి చెందిన అమ్మాయి. టెలివిజన్ షోలు చేస్తూ కెరియర్ ప్రారంభించిన ఈమె అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా ద్రౌపదిగా అందరికీ గుర్తిండిపోయే పాత్రలో కనిపించి మెప్పించింది. ఇప్పటికీ ఆమె చేసిన పాత్రల గురించి అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ద్రౌపది పాత్రకు సరైన న్యాయం చేసిన ఈమె.. కేవలం నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

ముఖ్యంగా రూపా గంగూలీ 2016 అక్టోబర్ నెలలో భారత రాష్ట్రపతిచే రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేయబడింది. ఇలా ఆమె మరింత మందికి తెలిసిపోయింది. దేశవ్యాప్తంగా ఈమె పేరు మారు మోగింది. కేవలం బెంగాలీలోనే కాకుండి హిందీ, కన్నడ, మలయాళ, అస్సామీ, ఇంగ్లీష్, ఇటాలియన్ వంటి భాషల్లో కూడా మెరిసింది. అంతే కాదండోయ్ తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన పాత్రల్లో కనిపించింది. శశిరేఖ శపథం, అన్ స్పెక్టర్ భవానీ, నా ఇల్లే నా స్వర్గం వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసింది.

Bollywood Senior Star Heroine Roopa Ganguly Shocking Comments About His Life Check Details

ఇంత సక్సెస్ ను అందుకున్న ఈ సీనియర్ స్టారీ హీరోయిన్ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె 1992లో మెకానికల్ ఇంజినీర్ ద్రుభో ముఖర్జీనికి పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఓ బాబు కూడా పుట్టాడు. కానీ ఆ తర్వాత భర్తతో చాలా ఇబ్బందులు పడినట్లు ఇటీవలే ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. అయితే మొదటి భర్తతో కల్గిన సంతానం ఉండడం వల్ల చాలా సార్లు ఆమె విడాకులు తీసుకునే నిర్ణయాన్ని వాయిదా వేసుకుందట. కానీ సమస్యలు భరించలేక చాలా సార్లు ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుందట.

బాబు పుట్టడానికి ముందు ఒకసారి, పుట్టాకా రెండు సార్లు కూడా ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందట. కానీ అవేవీ వర్కౌట్ కాక ప్రాణాలతో బయట పడినట్లు స్పష్టం చేసింది. ఎలాగోలా 2007లో భర్తతో విడాకులు పొందినట్లు చెప్పుకొచ్చింది. భర్తతో విడిపోయిన రూపా గంగూలీ సింగర్ దిబ్యేందు ముఖర్జీ తో ప్రేమలో పడినట్లు చెప్పుకొచ్చారు. ఆయనతో కూడా చాలా కాలం పాటు సహజీవనం చేశారట. కానీ ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదట.

Bollywood Senior Star Heroine Roopa Ganguly Shocking Comments About His Life Check Details

తాను కోరుకున్న జీవితం దక్కక.. వైవాహిక బంధంలో అనేక సమస్యలు ఎదుర్కున్నట్లు స్పష్టం చేసింది. అవన్నీ చూసిన తనకు జీవితంపై ఆసక్తి పోయిందని.. అలాంటి బంధాల జోలికి మరోసారి వెళ్లకూడదని అర్థం అయినట్లు తెలిపింది. ఇన్ని సమస్యలు ఎదుర్కున్న ఆమె రాజకీయ నాయకురాలిగా మారింది. ప్రస్తుతం 60 ఏళ్ల వయసు కల్గిన ఈమె.. బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు. కానీ అంత క్రియాశీలకంగా పని చేయడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X