స్టార్ హీరోయిన్ డ్రైవర్‌కి కరోనా పాజిటివ్.. బాలీవుడ్‌లో డేంజర్ బెల్స్
బాలీవుడ్‌లో ప్రస్తుతం కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో సెలబ్రెటీ చుట్టూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కొందరు బాలీవుడ్ స్టార్స్ కి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. బచ్చన్ ఫ్యామిలీ కరోనా దాటికి పూర్తిగా క్వారంటైన్ లోకి వెళ్లింది. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ డ్రైవర్ కి కూడా కరోనా పాజిటివ్ అని తెలడంతో ఒక్కసారిగా బాలీవుడ్ మళ్ళీ షాక్ కి గురైంది.

స్టార్ హీరోయిన్.. కోవిడ్-19 పరీక్షలు
ఆ హీరోయిన్ మరెవరో కాదు. సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అడుగులు వేస్తున్న సారా అలీ ఖాన్ ఇటీవల కోవిడ్ 19 పరీక్షలు కూడా చేయించుకుంది. డ్రైవర్ కి కూడా కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఆమె వెంటనే అలెర్ట్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది.

క్లారిటీ ఇచ్చిన సారా అలీ ఖాన్..
మా డ్రైవర్ కి కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. వెంటనే బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ వారు అతన్ని క్వారంటైన్ సెంటర్ కి తరలించారు. వెంటనే నా కుటుంబ సబ్యులకు అలాగే ఇతర స్టాప్ మెంబర్స్ కి కూడా కరోనా పరీక్షలు చేయడం జరిగింది. ఆ టెస్ట్ లో మా అందరికి కూడా నెగిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేము కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉంటున్నాం.

హీరోయిన్ ఇంటికి శానిటైజేషన్..
మా కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని సేఫ్ గా ఉంచిన బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సారా అలీ ఖాన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అలాగే సారా అలీ ఖాన్ ఇంటిని అలాగే పరిసర ప్రాంతాలను కూడా బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ వారు శానిటైజేషన్ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.

బాలీవుడ్ లో భయం భయం..
ప్రస్తుతం బాలీవుడ్ ని కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురి చేస్తోంది. మునుపెన్నడు లేని విధంగా అగ్ర తారలు సైతం కరోనా వైరస్ ధాటికి భయం భయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ అలాగే ఐశ్వర్యారాయ్, వారి కూతురు ఆరాధ్యకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు క్వారంటైన్ లోనే ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











