ఆ స్టార్ హీరోయిన్‌కు పాములు అంటే ప్రాణమట.. ఇదేం పైత్యంరా నాయనా అంటున్న నెటిజెన్లు!
చాలా మంది సెలబ్రిటీలు ఎక్కువగా తమకు నచ్చిన జంతువలను పెంచుకుంటారు. ఎక్కడకు వెళ్లినా వాటితో పాటే వెళ్తూ రచ్చ చేస్తుంటారు. ఇందులో ఎక్కువగా కుక్కలు, పిచ్చుకలు, చిలుకలు, కుందేళ్లు, పిల్లులు.. ఇలా వివిధ రకాల జంతువులను పెంచుకుంటారు. చాలా ఎక్కువ మందికి కుక్కలు అంటే ఇష్టం ఉంటుంది. ఆ తర్వాతి స్థానంలో పిల్లులు, పక్షలు ఉంటాయి. కానీ కాటేసి చంపే పాములు అంటే మాత్రం చాలా మంది తీవ్రంగా భయపడిపోతారు. పాము అనే పేరు వింటేనే ఆమడ దూరం పరిగెత్తుతూ ఉంటారు. ఏదో చైనా వంటి దేశాల్లో తప్పితే పాములను ఇష్టపడే వాళ్లు చాలా తక్కువ మంది. ఇష్టపడ్డా వాటిని ఏమనకుండా వదిలేస్తారే తప్ప పెంచుకోరు.
పాములు పట్టే వాళ్లు, లేదా చాలా ధైర్య వంతులు మాత్రమే పాములను చేత పట్టుకొని ఫొటోలు దిగుతారు. అందులోనూ తమకు భయంలేదని నిరూపించుకోవడానికి మాత్రమే కానీ.. తమకు పాములు అంటే ఇష్టం అని మాత్రం అలా చేయరు. కానీ తాజాగా బాలీవుడ్ కు చెందిన ఓ హీరోయిన్ తనకు కుక్కలతో పాటు పాములు అంటే చాలా ఇష్టం అని చెప్పంది. వాటితో కలిసి దిగిన ఫొటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ముందుగా కుక్కలతో ఫొటో దిగిన ఆమె ఆ తర్వాత చాలా పెద్ద పామును చేతుల్లో పట్టుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

ఓ హీరోయిన్ పాములు పట్టుకొని ఫొటోలు దిగడం.. అందులోనూ అవంటే తనకు ప్రాణం అని చెప్పడంతో ఈ ఫొటోలు కాస్త వైరల్ గా మారాయి. అయితే ఇలా కామెంట్లు చేసింది, ఫొటోలు పోస్ట్ చేసింది మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ దియ ఇయర్ - 2 చిత్రంతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె అదే ఏడాది పతి పత్నీ ఔర్ వో సినిమాలోనూ నటించి మెప్పించింది. అలాగే ఆంగ్రేజీ మీడియం, ఖాలీపీలీ వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల్లోనూ మెరిసింది. ఇక ఆ తర్వాత ఏడాదే లైగర్ సినిమాతో తెలుగు సినీ రంగంలోనూ కాలు మోపింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఈ చిత్రం ఫ్లాప్ గా మారడంతో... తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయింది.

ఇక ఆ తర్వాత అనన్య పాండేకు తెలుగులో ఎలాంటి అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్ లో భారీగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ రచ్చ చేస్తోంది. ఓవైపు సినిమాల్లో పుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుందీ ముద్దుగుమ్మ. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అలాగే ట్రెండీ ట్రెండీ ఔట్ ఫిట్లు ధరిస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంది. తాజాగా ఈమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
అందులో తనకు కుక్కలు, పాములు అంటే ఇష్టం అంటూ వాటితో పాటు దిగిన ఫొటోలను షేర్ చేసింది. పాములు అంటే ఇష్టం అని చెప్పడంతో అంతా షాకవుతున్నారు. ఇదేం పైత్యంరా బాబు అంటూ చాలా మంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఓ కొండ చిలువతో కలిసి దిగి పెట్టిన ఫొటో అయితే నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. పాములు పట్టుకొని ఫొటోలు దిగిన లైగర్ బ్యూటీ లుక్ ను మీరు కూడా ఓసారి చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం.


Click it and Unblock the Notifications











