మరో వివాదంలో కంగన రనౌత్.. బాలీవుడ్ క్వీన్‌కు బాంబే కోర్టు మొట్టికాయ

బాలీవుడ్ నటి కంగన రనౌత్ మరో వివాదంలో చిక్కుకొన్నారు. తన పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ చేయడానికి నిరాకరించారని పాస్‌పోర్టు అథారిటీపై కోర్టులో ఫిర్యాదు చేయడంపై కోర్టు స్పందించింది. కంగన రనౌత్ దాఖలు చేసిన పిటిషన్‌‌లో ప్రతీవాదుల గురించి స్పష్టంగా వివరించడంలో ఆమె తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖీ విఫలమయ్యారు. కాబట్టి ఈ కేసులో ప్రతివాదుల పేర్లను స్పష్టంగా తెలియజేస్తూ పిటిషన్ దాఖలు చేయాలని కొంత గడువు ఇస్తూ మంగళవారం అంటే జూన్ 15వ తేదీన జస్టిస్ పీబీ వరాలే, ఎస్పీ తవాడేతో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

కంగన రనౌత్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. పూర్తి వివరాలు, ఆధారాలు లేకుండా పాస్‌పోర్టు అథారిటీకి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయాలా? అంటూ రిజ్వాన్ సిద్దిఖీని ప్రశ్నించింది.

Bombay High court Shock to Kangana Ranaut: Cant pass order Against Passport Authority with Vague Petition

ఇటీవల కంగన రనౌత్‌ చేసిన అభ్యంతర ట్వీట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కొందరు కేసు నమోదు చేశారు. ఆ కేసును పరిగణనలోకి తీసుకొని పాస్‌పోర్టు అథారిటీ కంగన పాస్‌పోర్టును రెన్యూవల్ చేయడానికి నిరాకరించింది. దాంతో కంగన ఈ విషయాన్ని తన లాయర్ సిద్ధిఖీ ద్వారా బాంబే హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ విషయంలో సత్వరం న్యాయం జరిపించాలని కోరింది.

ఈ క్రమంలో కంగన రనౌత్ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ధర్మాసనం వాస్తవాలు లేవని, పూర్తి వివరాలు పిటిషన్‌లో పొందుపరచాలని సూచించింది. ఈ సందర్భంగా సిద్ధిఖీ తన వాదనలు వినిపిస్తూ.. పాస్‌పోర్టు అథారిటీ రాతపూర్వకమైన అభ్యంతరం తెలియజేయలేదు. కేవలం మాటల రూపంలో రెన్యూవల్ చేయడానికి నిరాకరించారు అని తెలిపారు.

అంతేకాకుండా కంగన రనౌత్ సినిమా ధాకడ్ షూటింగుకు విదేశాలకు వెళ్లాల్సి ఉంది కాబట్టి పాస్‌పోర్టు రెన్యూవల్ త్వరగా అయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును లాయర్ సిద్ధిఖీ కోరగా.. ఇది కేవలం సినిమాకు సంబంధించిన విషయం. కావాలంటే షూటింగును వాయిదా వేసుకోవచ్చు. కంగనకు ఈ విషయం అంత ముఖ్యం అనుకొంటే.. ముందుగానే పూర్తి వివరాలతో కోర్టుకు రావాల్సింది. సినిమా షూటింగ్ అనేది ఏడాది పాటు సాగేది.. వారం ఆలస్యం అయితే ఏమీ కాదు అని కోర్టు చురకలు అంటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X