శ్రీదేవి మరణం అలా జరిగింది.. దుబాయ్‌లో నాకు లైడిక్టర్ పరీక్షలు..పెదవి విప్పి బోని కపూర్ సంచలన విషయాలు

భారతీయ సినిమా పరిశ్రమలో దిగ్గజ నటి శ్రీదేవీ మరణంపై ఇప్పటి వరకు భర్త, బాడలీవుడ్ నిర్మాత బోని కపూర్ పెదవి విప్పారు. శ్రీదేవి మరణం తర్వాత ఆయన మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. శ్రీదేవి మరణం వెనుక కారణాలను చెప్పడానికి నిరాకరించారు. అయితే తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవీ మరణంపై సంచలన విషయాలు వెల్లడించారు. శ్రీదేవి మరణానికి ఆమె అనుసరించిన ఆహార అలవాట్లే కారణమని బోని చెప్పారు. బోని చెప్పిన విషయాల వివరాల్లోకి వెళితే..

శ్రీదేవి తన అందాన్ని కాపాడుకోవడానికి డైటింగ్ విపరీతంగా చేసేది. ఉప్పు లేకుండా భోజనం చేసేది. దాంతో మెదడులో బ్లాకౌట్స్ ఏర్పడ్డాయి. ఆ కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు సృహ కోల్పోయి పడిపోయేది. నాజుకుగా కనిపించడానికి ఆహార విషయంలో కఠిన నియమాలు పాటించడం వల్లే శ్రీదేవీ మరణం ఏర్పడింది అని బోని కపూర్ చెప్పారు.

Boney Kapoor revealed shocking facts behind Sridevi Death in Dubai, Do You He was faced Lie detect test?

శ్రీదేవీది సహజ మరణం కాదు. యాక్సిడెంటల్ డెత్. దుబాయ్‌లో ఆమె మరణించిన సమయంలో నేను ఈ విషయంపై మాట్లాడలేకపోయాను. ఎందుకంటే.. దుబాయ్‌లో పోలీసులు నన్ను దాదాపు 24 గంటల నుంచి 48 గంటల పాటు ఏకధాటిగా విచారించారు. రకరకాల ప్రశ్నలతో ఇంటరాగేట్ చేశారు అని బోని కపూర్ చెప్పారు.

శ్రీదేవి మరణం తర్వాత ఇండియన్ మీడియా నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకపోయాను. అందుకే ఎక్కువగా ఆమె మరణం గురించి చెప్పలేకపోయాను. దుబాయ్ పోలీసుల తమ విచారణ అనంతరం ఎలాంటి అనుమానాలు లేవని శ్రీదేవీ మరణంపై రిపోర్టు ఇచ్చారు. నన్ను రకరకాలుగా ప్రశ్నించి నా నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించారు అని బోని కపూర్ తెలిపారు.

Boney Kapoor revealed shocking facts behind Sridevi Death in Dubai, Do You He was faced Lie detect test?

శ్రీదేవీ మరణించిన తర్వాత దుబాయ్‌లో పోలీసులు విచారించే సమయంలో నాకు లైడిక్టర్ పరీక్షలు నిర్వహించారు. రకరకాల పద్దతులతో శ్రీదేవీ మరణంపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేసుకొనేందుకు విచారించారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించారనే విషయం తేలడంతో నన్ను విడిచిపెట్టారు. దాంతో శ్రీదేవీ భౌతికకాయాన్ని తీసుకొని ఇండియాకు వచ్చాం అని బోని కపూర్ చెప్పారు.

దుబాయ్‌లో శ్రీదేవి ఆకస్మిక మరణం అందర్నీ విషాదానికి గురిచేసింది. ఫిబ్రవరి 24వ తేదీన శ్రీదేవీ ప్రమాదవశాత్తు మరణించారనే విషయం సంచలనంగా మారింది. అయితే శ్రీదేవీది సహజ మరణం కాదు అంటూ అనేక మంది తమ సందేహాలను వ్యక్తం చేశారు. ఆమె మరణించి 5 ఏళ్లు దాటినా ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. దాంతో కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ.. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోని కపూర్ సంచలన విషయాలను బయటపెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X