Boycott Radhika Apte ట్రెండింగ్.. హఠాత్తుగా ఎగబడిన నెటిజన్లు.. ఎందుకంటే?

మన దేశంలో విమర్శకుల ప్రశంసలు పొందిన అతికొద్ది మంది టాలెంటెడ్ నటిమణుల్లో రాధికా ఆప్టే కూడా టాప్ లిస్ట్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఈ సీనియర్ నటిమణి ఎంపిక చేసుకునే సినిమాల విధానం అయితే చాలా భిన్నంగా ఉంటుంది. వీలైనంత వరకు ఎక్కువగా ప్రయోగాత్మకమైన కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ సినిమాల్లో కాంట్రవర్సీ ఉన్నా కూడా అమ్మడు పెద్దగా పట్టించుకోదు. పాత్ర నచ్చితే నగ్నంగా కూడా నటించాడనికి సిద్ధమే అన్నట్లుగా అడుగులు వేస్తోంది.

ఇక మరికొన్ని సార్లు రాధిక ఓ వర్గం వారి నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవల్సి వస్తోంది. ఇక ప్రస్తుతం 'బాయ్‌కాట్ రాధికా ఆప్టే' అనే ట్యాగ్ కూడా ట్విట్టర్‌ లో ట్రెండింగ్‌ లోకి వచ్చేసింది. అయితే ప్రస్తుతం రాధిక నటిస్తున్న ఏ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ కూడా రాలేదు. ఆమె కొత్త సినిమాలు ఏవి కూడా కూడా విడుదల అవ్వలేదు. అలాంటిదేమి లేనప్పటికీ, ఇప్పటికీ ఆమె పేరు సోషల్ మీడియా ట్రెండ్‌ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ బ్యూటీ భారతీయ సంప్రదాయలపై ఏ మాత్రం గౌరవం లేకుండా అశ్లీలత ఎక్కువగా ఉన్న సినిమాల్లో నటిస్తోందని ఇలాంటి వారికి బాలీవుడ్ లో ఎంతమాత్రం అవకశాలు ఇవ్వకూడదు అంటూ ఓ వర్గం నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Boycott Radhika Apte trending in social media

గతంలో అజయ్ దేవగన్ ప్రొడక్షన్ లో వచ్చిన పార్చేడ్ సినిమాలో రాధికా ఆఫ్టే నగ్నంగా నటించింది. ఇక అందుకే సంబంధించిన ఫొటోలు కొన్ని హఠాత్తుగా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఆ పాత బడిన లీక్ సన్నివేశాలను ఫొటోలను జత చేస్తూ ఓ వర్గం నెటిజన్లు గ్యాప్ లేకుండా వాయించేస్తున్నారు. అసలు ఆమె మన సంస్కృతికి ఏ మాత్రం గౌరవడం ఇవ్వడం లేదని బాలీవుడ్ లో ఇలాంటి వాళ్లకు స్థానం ఇవ్వకూడదని కూడా అంటున్నారు. ఇటీవల అశ్లీల వీడియోలతో బిజినెస్ చేసిన రాజ్ కుంద్రా లాంటి వారి మ్యాటర్ ను కూడా ఇప్పుడు రాధికతో పోల్చడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సడన్ గా పుట్టుకొచ్చిన #Boycott Radhika Apte ట్యాగ్ పై ఇంతవరకు ఆ బ్యూటీ వివరణ ఇవ్వలేదు. మరి ఆ విషయంలో ఏ విధంగా వివరణ ఇస్తుందో చూడాలి.

Boycott Radhika Apte trending in social media

బాలీవుడ్‌లో బోల్డ్‌ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటున్న రాధిక ఆప్టే తనపై విమర్శలు వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇక బాలీవుడ్ హిట్ మూవీ 'వహ్‌! లైఫ్‌ హో తో ఐసీ!'(2005)తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాధిక అనంతరం భాషతో సంబందం లేకుండా అడుగులు వేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూడా రక్త చరిత్ర 1 అండ్ 2, ప్రకాశ్ రాజ్ ధోనీ, లెజెండ్‌, లయన్‌ వంటి తెలుగు సినిమాల్లో కూడా విభిన్నమైన పాత్రల్లో నటించింది. ఇక ఈ బ్యూటీ గతంలో అయితే పలు రకాల కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ మధ్య మీటూ విషయంపై కూడా గట్టిగానే పోరాటం చేసి మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X