Alia Bhatt: నోరు జారిన RRR​ బ్యూటీ.. రూ. 500 కోట్ల ఫ్లాప్​ బస్టర్​ చేద్దామని ట్రోలింగ్​

ప్రస్తుతం బాలీవుడ్​ కష్ట కాలం ఎదుర్కొంటున్నట్లే కనిపిస్తుంది. బాయ్​కాట్​ పేరిట హిందీ చిత్రాలకు, హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు నెటిజన్లు. ఏం కొంచెం నోరు జారున ఇబ్బందుల్లో పడిపోతున్నారు. కాన్ఫిడెంట్​ అనాలో, లేదా ఓవర్​కాన్ఫిడెంట్​తోనో బీటౌన్​ డైరెక్టర్​ అనురాగ్ కశ్యప్​, హీరోయిన్​ తాప్సీ బాయ్​కాట్​పై నోరు జారి బోర్ల బొక్కల పడిన విషయం తెలిసిందే. వారి కాంబినేషన్​లో వచ్చిన దొబారా చిత్రానికి కనీసం 2 నుంచి 5 శాతం ఆక్యుపెన్సీ లేకపోవడంతో సినిమాను తీసేసారు డిస్ట్రీబ్యూటర్లు. ఇప్పుడు అలాగే బాలీవుడ్​ గంగూబాయి బాయ్​కాట్​పై నోరు జారింది. మరి అది ఎలానో చదివేద్దామా!

 దర్శకుడి కుమార్తెగా..

దర్శకుడి కుమార్తెగా..

స్టూడెంట్​ ఆఫ్​ ది ఇయర్​ మూవీతో హిందీ చిత్రసీమకు హీరోయిన్​గా పరిచయమైన ముద్దుగుమ్మ అలియా భట్​. ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు మహేశ్ భట్​ కుమార్తెగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈ క్యూట్​ గుమ్మ తర్వాత తన నటనతో అభిమానులను సంపాదించుకుంది.

ఆర్​ఆర్ఆర్​లో సీతగా..

ఆర్​ఆర్ఆర్​లో సీతగా..

2 స్టేట్స్​, హైవే, డియర్​ జిందగీ, ఉడ్తా పంజాబ్, రాజీ, గల్లీ బాయ్​, కలంక్​ వంటి తదితర సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే ఇటీవలే దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది.

 ప్రమోషన్స్​లో భాగంగా..

ప్రమోషన్స్​లో భాగంగా..

ప్రస్తుతం అలియా భట్​, ఆమె భర్త రణ్​బీర్​ కపూర్​ తొలిసారి జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న బ్రహ్మాండంగా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఇటీవల ఓ మ్యాగజైన్​కు ఇంటర్వ్యూ ఇచ్చింది అలియా భట్​.

అలా ఎవరు కోరుకోరు..

అలా ఎవరు కోరుకోరు..

ఈ ఇంటర్వ్యూలో బాయ్​కాట్​ ట్రెండ్​, నెపోటిజంపై అలియా భట్​ స్పందించింది. ''ఫలనా వాళ్ల కుటుంబంలో పుట్టాలని ఎవరు కోరుకోరు. అలానే మనం పుట్టం. నేను అలా కోరుకోలేదు. సినీ బ్యాక్​గ్రౌండ్​ ఉన్న కుటుంబంలో పుడితే అది మొదటి చిత్రం వరకే ఉపయోగపడుతుంది.

అది నా తప్పంటే ఎలా?

అది నా తప్పంటే ఎలా?

అసలు ఆ కుటుంబంలో పుట్టడమే నా తప్పంటే ఎలా? మీకు నేను ఇష్టం లేకపోతే చూడకండి'' అంటూ ఘాటుగానే స్పందించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్​ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. అలియా చేసిన కామెంట్స్​పై నెటిజన్లు ట్రోలింగ్​ చేస్తున్నారు. ఇక అలియా నటించే ఏ సినిమాను చూడొద్దు అంటూ పోస్ట్​లు పెడుతున్నారు.

రూ. 500 కోట్ల ఫ్లాప్​ బస్టర్​ చేద్దాం..

రూ. 500 కోట్ల ఫ్లాప్​ బస్టర్​ చేద్దాం..

''అలియా కోరిక మేరకు బ్రహ్మాస్త్ర చిత్రాన్ని రూ. 500 కోట్ల ఫ్లాప్​ బస్టర్​ చేద్దాం. వారికి మనం కేవలం టికెట్ల లాంటివాళ్లం మాత్రమే. వారికి మన డబ్బులు కావాలి అంతే. మనం అవసరం లేదు'' అని ట్రోలింగ్​ మొదలెట్టేసారు.

కామెంట్స్​తో దెబ్బతిన్న కరీనా..

కామెంట్స్​తో దెబ్బతిన్న కరీనా..

ఇది వరకు లాల్​ సింగ్​ చద్ధా సినిమా ప్రమోషన్ల సమయంలో కరీనా కపూర్​ ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ఇష్టం లేకపోతే సినిమాలు చూడటం మానేయండని చేసిన కామెంట్స్​ను సీరియస్​గా తీసుకున్న నెటిజన్లు ఆ సినిమాకు ఎలాంటి రిజల్ట్​ చూపించారో తెలిసిందే. ఇక ఇప్పుడు అలియా చేసిన కామెంట్స్​ బ్రహ్మాస్త్ర మూవీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కాలమే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X