Mouni Roy: నాభి అందాలతో వయ్యారాలు పోయిన 'బ్రహ్మాస్త్రం' విలన్..
ఇంతకుముందు సినిమాలో అవకాశాలు రావాలంటే బుల్లితెరపై నటన కనబర్చినా వారై ఉండాలి. లేదా యాంకర్‌గా చేస్తు అయిన ఉండాలి. లేదా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుంటే కంటిన్యూగా అవకాశాల కోసం క్యూ కట్టాలి. అలాంటి వారి కోసం తమ టాలెంట్‌ను చూపించుకునేందుకు సోషల్ మీడియా ఒక చక్కని వేదిక అయింది. ఈ మీడియా ద్వారా హీరోయిన్లుగా స్టార్డమ్ సంపాదించుకున్న వారు సైతం తమ ఫొటోలు, వీడియోలతో అభిమానులతో టచ్‌లో ఉంటారు. అలా బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన బ్యూటీ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో హాట్ పోజులతో అట్రాక్ట్ చేస్తోంది.

దేశవ్యాప్తంగా..
మౌనీ రాయ్ అంటే కొంచెం గుర్తు పట్టడం కష్టమే గానీ, నాగిని అంటే మాత్రం అందరికి తెలుసు. ఎందుకంటే మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇందులో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్న మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి నాగినీ ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది.

సీరియళ్లతో పాపులర్..
మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన మౌనీ బ్యూటీ 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర సీరియళ్లతో పాపులర్ అయింది.

జాతియ స్థాయిలో గుర్తింపు..
వరుసగా సీరియళ్లు చేయడంతో మౌనీ రాయ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే 'నాగిని' సీరియల్ ద్వారా మరింత క్రేజ్‌ను పెంచుకుంది మౌనీ రాయ్. ఒక విధంగా చెప్పాలంటే ఈ సీరియల్ ఆమె కెరీర్‌నే మార్చేసింది. మూడు సీజన్ల పాటు సాగిన ఈ సీరియల్‌లో మౌనీ లీడ్ రోల్ చేసింది. ఇది ఇండియాలోని అనేక భాషల్లో డబ్బింగ్ అయింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో పేరు దక్కింది.

హీరోయిన్గా కూడా..
మౌనీ రాయ్ ముందుగా కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. అలాగే, 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో కథానాయికగా కూడా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో తళుక్కుమంది. అంతెందుకు యశ్ నటించి సూపర్ హిట్ అయిన కేజీఎఫ్ మూవీలో హిందీలో ఐటమ్ సాంగ్ చేసి మంచి పేరు తెచ్చుకుంది.

లేడి విలన్‌గా..
ప్రస్తుతం బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా చేస్తున్న 'బ్రహ్మాస్త్రం' చిత్రంలో లేడీ విలన్ పాత్రను మౌనీ రాయ్ పోషించింది. ఆమె పాత్ర హాలీవుడ్ పాత్ర వాండాను పోలి ఉందని పలు మీమ్స్ కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ వస్తోంది ఈ స్లిమ్ బ్యూటీ. అప్పుడప్పుడు తన అందాలను హాట్‌గా ఎక్స్పోజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది.
గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్లో..
ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో హాట్ ఫొటోలను వదిలింది బ్యూటిఫుల్ మౌనీ రాయ్. గ్రీన్ కలర్ సారీలో, స్లీవ్‌లెస్ బ్లౌజ్లో తన నాభి అందాలను చూపిస్తూ హాట్‌గా పోజులిచ్చింది. కైపెక్కించే ఆమె చూపులు కుర్రాళ్ల గుండెలకు ఘాటుగా గుచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటోలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











