బాహుబలి, అర్జున్ రెడ్డి చూశా.. విజయ్ దేవరకొండతో సినిమా గురించి బ్రెజిల్ బ్యూటీ!
పరదేశి భామలకు ఇండియన్ సినిమాలో క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ సంచలనం. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో విజయ్ దేవరకొండ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన నోటా చిత్రం ఆడియన్స్ ని నిరాశపరిచింది. దీనితో తదుపరి చిత్రం విషయంలో విజయ్ దేవరకొండ జాగ్రత్త వహిస్తున్నాడు. విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ క్రాంతి మాధవ్ దర్శత్వంలో తెరకెక్కబోతోంది.

ముగ్గురు హీరోయిన్లతో
విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ లో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు. విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ దర్శత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, బ్రెజిల్ మోడల్ ఇసాబెల్లె హీరోయిన్లుగా నటించనున్న సంగతి తెలిసిందే.

ఏడేళ్ల నుంచి
విజయ్ దేవరకొండ చిత్రంలో అవకాశం దక్కించుకున్న ఇసాబెల్లె తాజాగా స్పందించింది. తాను ఏడేళ్ల నుంచి ఇండియాలో ఉన్నట్లు తెలిపింది. ఇండియా నాకు సెకండ్ హోమ్ లాంటిది. ఇప్పటికే మూడు హిందీ చిత్రాల్లో ఇసాబెల్లె నటించింది. తొలిసారి సౌత్ ఇండియన్ మూవీ లో అవకాశం దక్కించుకోవడంతో ఇసాబెల్లె సంతోషం వ్యక్తం చేసింది.

కథ చెప్పగానే
దర్శకుడు క్రాంతి మాధవ్ నాకు కథ వినిపించగానే సౌత్ లో ఇదే తనకు సరైన డెబ్యూ మూవీ అని అనిపించింది. అందుకే అంగీకరించా. హైదరాబాద్ కు గతంలో కొన్నిసార్లు యాడ్ షూట్ కోసం వచ్చా. కానీ తొలిసారి సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టానని ఇసాబెల్లె తెలిపింది.

తెలుగులో ఆ రెండు సినిమాలు
నాకు తెలుగు మాట్లాడడం రాదు. తెలుగులో అర్జున్ రెడ్డి, బాహుబలి చిత్రాలని చూశా. విజయ్ దేవరకొండతో సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్నట్లు ఇసాబెల్లె తెలిపింది. ఇంటికి చాలా దూరంలో ఉంటూ కొత్త వాతావరణానికి అలవాటు పడాలంటే నాకు కాస్త టైం పడుతుందని ఇసాబెల్లె తెలిపింది. విజయ్ దేవరకొండ చిత్రంతో ఈ బ్రెజిల్ బ్యూటీ ఎలాంటి మాయ చేస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











