చిక్కుల్లో సమంత ప్రాజెక్ట్.. కోట్ల రూపాయలు పక్కదారి!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత పూర్తిగా ఫిల్మ్స్ పైనే దృష్టి సారించింది. కానీ అనుకోకుండా ఆమె ఆరోగ్యం దెబ్బతిని కాస్తా బ్రేక్ పడింది. మయోటైసిస్ వ్యాధితో సమంత దాదాపు రెండేళ్ల పాటు ఇబ్బంది పడింది. నరాల బలహీనత గల ఆ వ్యాధి కారణంగా ఏకంగా ఏడాది సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంతగానో కోరుకున్నారు. అందరి ప్రార్థనల మేరకు సమంత కోలుకుంది. ఇక కొద్ది నెలల నుంచి మంచి తన ప్రాజెక్ట్స్ ల్లో బిజీగా కనిపిస్తోంది.

తెలుగు చివరిగా సమంత రెండేళ్ల కింద 'శాకుంతలం', 'ఖుషి' చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత నుంచి తెలుగులో ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. రీసెంట్ 'మా ఇంటి బంగారం' చిత్రాన్ని ప్రకటించినా సాలిడ్ అప్డేట్ అయితే రాలేదు. దీంతో సామ్ బాలీవుడ్ లోనే ఫుల్ బిజీ అవుతోంది. 'ది ఫ్యామిలీ మెన్' సిరీస్ నుంచి అక్కడే సామ్ ఎక్కువగా సినిమాలపై ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ నిర్మించిన క్రేజీ సిరీస్ 'సిటాడెల్ : హనీ బన్నీ'తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సీజన్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.

Break to Samantha Ruth Prabhu s Dream Project Due to fraud Producer Exposed

ఇదిలా ఉంటే... సామ్ చేతిలో ఉన్న ఓ ప్రాజెక్ట్ చిక్కుల్లో పడటం షాక్ కు గురిచేసింది. ఆమె నటిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ 'రక్త్ : భ్రమండ్'. సమంత డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సిరీస్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద సంస్థ ఈ సిరీస్ ను నిర్మిస్తుండటం విశేషం. దర్శకుడు రహి అనిల్ బర్వే తెరకెక్కిస్తున్నారు. ఆదిత్య రాయ్ కపూర్, నటి వామికా గబ్బి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొన్నటి వరకు ఈ సిరీస్ షూటింగ్ సాఫీగానే సాగింది. కానీ బడ్జెట్ లో దోపిడీ జరుగుతుందనే నెపంతో షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారంట. కొంతమాత్రం షూటింగ్ కే సగానికిపైగా బడ్జెట్ ఖర్చై అవ్వడమే దానికి కారణమంటున్నారు.

రక్త్ : భ్రమండ్... నిర్మిస్తున్నవారిలో ఒక ప్రొడ్యూసర్ దుర్భుతితో కోట్ల రూపాయాలను పక్కదారి పట్టిస్తున్నారంట. టీమ్ ఆయన్ని విచారణ చేసి, ఆ తర్వాత షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ కేవలం 26రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంది. అంతలోనే కోట్ల రూపాయాల స్కామ్ అంటూ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడిందని తెలుస్తోంది.

Break to Samantha Ruth Prabhu s Dream Project Due to fraud Producer Exposed

మరోవైపు సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కు నిత్యం అందుబాటులోనే ఉంటోంది. వరుసగా పోస్ట్ లు పెడుతూ వస్తోంది. వాటితోనూ సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతుంది అంటూ పుకార్లు గుప్పుమంటున్నాయి. ఇటీవల నాగచైతన్య - శోభితా కలిసి ఎక్కువ కనిపించడం.. సమంత పెట్టిన పోస్టులు రిలేటెడ్ గా ఉన్నాయంటూ మొన్నటి వరకు సోషల్ మీడియాలో రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఇక సమంత మాత్రం ప్రస్తుతం తన ప్రాజెక్ట్స్ తోనే బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X