టాలీవుడ్ డైరెక్టర్‌తో డేటింగ్ రూమర్స్? ఆ హీరోతో రిలేషన్‌లో ఉన్నానంటూ హీరోయిన్ ట్విస్ట్!

చిత్ర పరిశ్రమలో బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న నటీనటులంతా ఒక్కొక్కరిగా మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నా. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఎప్పటి నుంచో ప్రేమాయణం సాగిస్తున్న అమ్మాయిలంతా తమ పార్టనర్స్‌, కాబోయే భర్తలను పరిచయం చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి తమిళ నటి బ్రిగిదా సాగా ఎంట్రీ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

తమిళనాడుకు చెందిన బ్రిగిదా సాగా.. తొలుత ఆహా కళ్యాణం అనే తమిళ సీరియల్‌లో పవి టీచర్‌గా బాగా ఫేమస్ అయ్యారు. ఈ పాపులారిటీతో సినీరంగం నుంచి ఆమెకు అవకాశాలు వచ్చాయి. 2019లో అయోగ్య అనే సినిమాతో వెండితెర మీదకి అడుగుపెట్టారు బ్రిగిదా. ఆ తర్వాత వర్మా, మాస్టర్ సినిమాలలో నటించారు. వెళన్, ఇరవిన్ నిజాల్, గరుగన్, కొజిపణ్నై చెల్లాదురై, మార్గాన్, ఇడ్లీ కడాయ్, హాట్ స్పాట్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. సింధూరం, పెదకాపు పార్ట్ 1 సినిమాలతో తెలుగు వారిని కూడా ఆకట్టుకున్నారు.

Brigida Saga Makes Relationship Official Introduces Boyfriend Ananth Ram

అందరు హీరోయిన్ల మాదిరిగానే బ్రిగిదాపైనా పలు రూమర్స్ వచ్చాయి. ప్రధానంగా తెలుగు డైరెక్టర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాలతో బ్రిగిదా రిలేషన్‌లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో వీరి వ్యవహారం చర్చనీయాంశమైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన పెదకాపు సినిమాలో బ్రిగిదా సాగా నటించారు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇద్దరిలో ఎవరూ దీనిపై స్పందించలేదు.

కానీ తమిళ దర్శకుడు, నటుడు పార్థిబన్ అప్పట్లోనే బ్రిగిదా- శ్రీకాంత్ అడ్డాల వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ మీడియాపై మండిపడ్డారు. ఇదంతా ఒట్టిదేనని, వీరిద్దరి మధ్య ఎలాంటి బంధం లేదని తేల్చేశారు. శ్రీకాంత్ సతీమణి రాగసుధను తానే కోలీవుడ్‌కి పరిచయం చేశానని, ఇలాంటి వాటిని ఆమె అస్సలు పట్టించుకోదేదని పార్ధిబన్ తేల్చేశారు. దాంతో శ్రీకాంత్ అడ్డాల- బ్రిగిదాల రిలేషన్ వార్తలకు చెక్ పడింది. ఇద్దరూ ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో బ్రిగిదా సాగా సైలెంట్‌గా షాకిచ్చారు. తాను ఒకరితో రిలేషన్‌లో ఉంటున్నానని, ప్రియుడితో ఉన్న ఫోటోను షేర్ చేశారు.

తమిళ నటుడు, యువ హీరో అనంత్ రామ్‌తో తాను రిలేషన్‌లో ఉన్నట్లు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు బ్రిగిదా. నా చిన్నప్పుడు అందమైన ప్రేమకథలు కేవలం సినిమాలలో ఉంటాయేమో అనుకునే దానిని, కానీ జీవితం నా కోసం అద్భుతమైన, అందమైన కథ రాసింది. నా ఫిలిం జర్నీలో నా లాంటి అభిరుచులు, కలలు ఉన్న అనంత్ నాకు తారసపడ్డాడు. స్నేహంతో మొదలైన మా బంధం ఇప్పుడు ప్రేమ వరకు వచ్చింది. అంతేకాదు.. మేమిద్దరం ఐ లవ్ యూ అని చెప్పుకుని వదిలేసే రకం కాదంటూ బ్రిగిదా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు బ్రిగిదా- అనంత్ రామ్‌ జోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పాలంటూ ఆకాంక్షిస్తున్నారు. అనంత్ రామ్ కూడా చిన్నా చితకా సినిమాలలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకునే యత్నాల్లో ఉన్నాడు.

Read more about: brigida saga srikanth addala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X