twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు.. నన్ను చంపేస్తారట.. ప్రముఖ నటి సంచలన పోస్టు

    |

    గత కొద్ది రోజులుగా ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న రైతుల ఆందోళన అంశం అంతర్జాతీయంగా వివాదాస్పదంగా మారుతున్నది. పాప్ సింగర్ రిహన్నా, పర్యావరణ వేత్త గ్రేటా థంబర్గ్ రైతులకు మద్దతుగా ట్వీట్ చేయడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో బ్రిటిష్ యాక్టర్ జమీలా జమీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

    రైతుల ఉద్యమానికి అండగా

    రైతుల ఉద్యమానికి అండగా

    బ్రిటన్ నటి, మోడల్, రేడియో ప్రజెంటర్, రచయిత, సామాజిక కార్యకర్తగా జమీలా జమీల్ సుపరితులు. ఇన్స్‌టాగ్రామ్‌లో 30 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల భారత్‌లో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ పోస్టు పెట్టారు. ఆ తర్వాత ఆమె పోస్టుపై సానుకూల, వ్యతిరేక కామెంట్లు వచ్చాయి. దాంతో మీడియాలో ఆమె పోస్టు వైరల్ అయింది.

    మహిళా సెలబ్రిటేలా స్పందించాలా?

    మహిళా సెలబ్రిటేలా స్పందించాలా?


    భారత్‌లో జరుగుతున్న రైతు ఉద్యమానికి నేను మద్దతు తెలియచేస్తున్నాను. కేవలం మహిళా సెలబ్రిటీల కాకుండా పురుషులు కూడా తమ గొంతును వినిపించాలి. రైతుల ఆందోళనకు అండగా నిలువాల్సి ఉంటుంది అని జమీలా జమీల్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు. తాను పెట్టిన పోస్టు తర్వాత తనకు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    రేప్, చంపేస్తామని బెదిరింపులు

    రేప్, చంపేస్తామని బెదిరింపులు


    జమీలా జమీల్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. కొద్ది నెలలుగా భారత్‌లో రైతుల ఆందోళనకు మద్దతు తెలియచేస్తున్నాను. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కొందరు నన్ను రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు. అలాగే ప్రాణాలు తీస్తామని హెచ్చరిస్తున్నారు అని తెలిపారు.

    సోషల్ మీడియాలో టార్గెట్

    సోషల్ మీడియాలో టార్గెట్

    సోషల్ మీడియాలోని డైరెక్ట్ మెసేజింగ్ సిస్టంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. నాపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నారు. నాకు కొన్ని పరిమితులు ఉంటాయి. అవేమీ పెట్టించుకోకుండా నన్ను వేధిస్తున్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న రైతులకు అందరూ అండగా ఉండాలి అని జమీలా జమీల్ పేర్కొన్నారు.

    English summary
    British Actress Jameela Jamil gets Rape and life threats due support on farmers' protest in India. She wrote in Instagram that, I have repeatedly spoken about the farmers in India over the past few months and what is happening there at the moment, but each time I do I am met with death and rape threats
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X