ఒంటిపై నూలు పోగు లేకుండా ప్రముఖ సింగర్.. పెళ్లికి ముందు అలాంటి నిర్వాకం!
హాలీవుడ్ పాప్ సింగర్, శృంగార తార బ్రిట్నీ స్పియర్స్ అంటే ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాప్ సంగీతం వినే వాళ్ళు వినని వాళ్ళు సైతం ఆమె పేరు జీవితంలో ఒక్కసారైనా వినే ఉంటారు. అంతలా ఆమె ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. ఎంతో కాలం తండ్రి సంరక్షణలో మగ్గిపోయిన ఆమె ఇటీవల ఒక రకంగా స్వాతంత్రం తెచ్చుకుంది. మరికొద్ది రోజుల్లో ఆమె పెళ్లి ఉంది అనగా ఏకంగా నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళితే..

స్వతంత్రం
సంగీత ప్రియులను ఉర్రూతలూగించడంలో ఆరితేరిన బ్రిట్నీ స్పియర్స్ తన అందచందాలతో కూడా మరింత పేరు సంపాదించింది. నిజానికి ఆమె మేజర్ అయ్యాక కూడా ఇష్టం లేకుండా తండ్రి సంరక్షణలో సుదీర్ఘ కాలం పాటు ఆమె ఉండాల్సి వచ్చింది. దీని మీద కోర్టులో సుదీర్ఘకాలం కేసు నడిచిన తరువాత గత ఏడాది ఆమె తండ్రి నుంచి విడిగా ఉండే దక్కించుకుంది.

నగ్నంగా ఫొటోలు
ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని వారి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయిన బ్రిట్నీ స్పియర్స్ ఇప్పుడు మరో వ్యక్తితో డేటింగ్ చేస్తూ మరోసారి తల్లి అయ్యేందుకు సిద్ధమైంది. అయితే మరి కొద్ది రోజుల్లో పెళ్లి ఉంది అంటూ ఆమె గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఏకంగా నగ్నంగా ఫొటోలు సోషల్ మీడియాలో వదిలి సంచలనం రేపింది.

సెన్సార్ చేసిందిలే
గతంలో ఒక వెకేషన్ కు వెళ్లగా ఆ వెకేషన్ ఫోటోలను వరుసగా ఇంస్టాగ్రామ్ షేర్ చేస్తూ వస్తున్నా బ్రిట్నీ స్పియర్స్ తాజాగా తన 3 న్యూడ్ ఫోటోలను తన ఫాలోవర్స్ లతో పంచుకుంది. అయితే ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఉన్న ఆ ఫోటోలలో తన ప్రైవేట్ భాగం కనిపించకుండా తనదైన శైలిలో సెన్సార్ చేసింది బ్రిట్నీ స్పియర్స్.

సోషల్ మీడియాలో వైరల్
దీంతో ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె ఫోటో చూసిన కొంతమంది అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది రోజులలో తల్లి కాబోతున్న ఆమె ఇలాంటి ఫోటోలు షేర్ చేసి ఎవరికి ఏమి మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటుంది అంటూ వారు గరంగరంగా కామెంట్లు చేస్తున్నారు.

త్వరలో పెళ్లి
ఇక 40 ఏళ్ల బ్రిట్నీ స్పియర్స్ డేవిడ్ లుకాడోను మూడవ వివాహం చేసుకోబోతున్నట్లు కొన్నేళ్ళ వార్తలు వచ్చాయి. నిజానికి రెండు పెళ్లిళ్ల తర్వాత తన మాజీ ఏజెంట్ జాసన్ ట్రావిక్‌తో కొంత కాలం సహాజీవనం చేసింది. అప్పట్లో వారిద్దరూ పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఎందుకనో ఆ పెళ్లి అయితే ఆచరణకు నోచుకోలేదు. అతనితో విడిపోయాక డేవిడ్ లుకాడోకు ఈ హాట్ బ్యూటీ దగ్గరైంది. ప్రస్తుతానికి ఆమె తన కొత్త ప్రియుడు సామ్‌ను పెళ్లాడబోతోంది. ఇందుకోసం డోనటెల్లా వెర్సాస్ తన పెళ్లి గౌనును తయారు చేస్తున్నాడని తెలిపింది. |


Click it and Unblock the Notifications











