పల్చటి చీరలో మెగా సిస్టర్.. అందాలన్నీ ప్రదర్శిస్తూ ఫోజులు
సినీ రంగంలోకి వచ్చే హీరోయిన్లు అందరూ సక్సెస్ అవుతారని చెప్పలేం. కానీ, కొందరు మాత్రం ఫస్ట్ మూవీకే సెన్సేషన్‌గా మారిపోతున్నారు. అలాంటి వారిలో మలయాళ చిన్నది ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. ఒకే ఒక్క చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ఈ భామ.. ఆరంభంలోనే వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అంత స్పీడుగా వెళ్లడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తెగ హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రియా ప్రకాశ్ వారియర్ కొన్ని ఫొటోలు వదిలింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!
కన్ను కొట్టి సంచలనంగా
టీనేజ్‌లో ఉన్నప్పుడే ప్రియా ప్రకాశ్ వారియర్ 'ఒరు అదార్ లవ్' అనే టీనేజ్ లవ్ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో ఈ అమ్మడు కన్నుగీటడం, ప్లయింగ్ కిస్ గన్ సీన్‌తో ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారింది. ఇదే సినిమా చాలా భాషల్లోకి కూడా అనువాదం అయింది. ఫలితంగా ప్రియా వారియర్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించడంతో పాటు ఆఫర్లు భారీగా వచ్చాయి.

తెలుగులోనూ మూవీలు
మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. డబ్బింగ్ చిత్రంతో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే నితిన్‌తో 'చెక్' అనే మూవీ చేసింది. కానీ, ఇది అంతగా ఆడలేదు. తర్వాత తేజ సజ్జాతో కలిసి 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' మూవీ చేసింది. ఇది మాత్రం ప్రేక్షకుల మన్ననలు పొందడంతో పాటు ప్రియా ప్రకాశ్‌కు ఫాలోయింగ్ పెంచింది.
ఆ సినిమాలతో సందడి
ప్రియా ప్రకాశ్ వారియర్ ఆరంభంలోనే బాలీవుడ్‌లో 'శ్రీదేవి బంగ్లా' అనే సినిమా చేసింది. వివాదం అయిన ఈ మూవీ షూటింగ్ దశలోనే ఆగింది. గత ఏడాది 'బ్రో' మూవీలో సాయి ధరమ్ తేజ్ చెల్లిగా చేసింది. కానీ, ఇది నిరాశ పరిచింది. ఇప్పుడు హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్', 'యారియన్ 2' కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీల్లో ప్రియా ప్రకాశ్ చేస్తోంది.

అక్కడ యమా బిజీగానే
మలయాళ పిల్ల ప్రియా ప్రకాశ్ వారియర్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించింది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే గడుపుతోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
గ్లామర్‌తో రెచ్చగొడుతూ
హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచే ప్రియా ప్రకాశ్ వారియర్.. వెండితెరపై గ్లామర్ షో చేయడానికి ఉత్సాహంగా వస్తోంది. అలాగే, సోషల్ మీడియాలో ఈ అమ్మడు అదిరిపోయే హాట్ షోతో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇలా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కవ్విస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు మారుమ్రోగిపోవడంతో పాటు తరచూ ట్రెండ్ అవుతోంది.

ఘాటు ఫొటోలతో రచ్చ
మలయాళ అమ్మాయి ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె నెట్ శారీలో విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఈ పిక్‌లలో పైన అందాలు మొత్తం కనిపించేలా ఘాటు ఫోజులు కూడా ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











