సాయి తేజ్ చెల్లి మితిమీరిన హాట్ షో: వలనే ఒంటికి చుట్టుకుని మరీ!
సాధారణంగా సినీ రంగంలో సక్సెస్ అయిన వాళ్లు మాత్రమే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా కొందరు హీరోయిన్లు ఫలితాలతో సంబంధం లేకుండా సత్తా చాటుతోన్నారు. అందులో మల్లూ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. మొదటి చిత్రంతోనే దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. అప్పటి నుంచి అన్ని భాషల్లో ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రియా ప్రకాశ్ వారియర్ హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. అవి మీరే చూడండి!
కన్నుగీటి సంచలనంగా
చిన్న వయసులోనే ప్రియా ప్రకాశ్ వారియర్ 'ఒరు అదార్ లవ్' అనే టీనేజ్ లవ్ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో ఈ అమ్మడు కన్నుగీటడం, ప్లయింగ్ కిస్ గన్ సీన్‌తో ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. ఇదే సినిమా చాలా భాషల్లోకి కూడా డబ్ అయింది. ఫలితంగా ప్రియా వారియర్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించడంతో పాటు ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి.

తెలుగులోకి వచ్చిందిగా
ఫస్ట్ మూవీతోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. డబ్బింగ్ చిత్రంతో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే నితిన్‌తో 'చెక్' అనే మూవీ చేసింది. కానీ, ఇది అంతగా ఆడలేదు. తర్వాత తేజ సజ్జాతో కలిసి 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' మూవీ చేసింది. ఇది మాత్రం ప్రేక్షకుల మన్ననలు పొందడంతో పాటు ఆమెకూ పేరు తెచ్చిపెట్టింది.
వరుస సినిమాలతో సత్తా
ఆరంభంలోనే ప్రియా ప్రకాశ్ వారియర్ బాలీవుడ్‌లో 'శ్రీదేవి బంగ్లా' అనే సినిమా చేసింది. వివాదం అయిన ఈ మూవీ షూటింగ్ దశలోనే ఆగింది. అయినా ఆ తర్వాత ఈ భామ మలయాళం, బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేసింది. ఇప్పుడు కూడా హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్', 'యారియన్ 2' కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీల్లో ప్రియా ప్రకాశ్ చేస్తోంది.
సాయి తేజ్ చెల్లెలిగానూ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపొందిన 'BRO' మూవీలోనూ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించింది. ఇందులో చిన్న పాత్రలోనే కనిపించినా మంచి పేరు తెచ్చుకుంది. దీని తర్వాత కూడా ప్రియా ప్రకాశ్ వారియర్‌కు తెలుగులో మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ చిన్నది కొన్ని సినిమాలు లైన్‌లో పెట్టింది.
అక్కడ యమా బిజీగానే
మలయాళ పిల్ల ప్రియా ప్రకాశ్ వారియర్ అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే గడుపుతోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన రేంజ్‌ను పెంచుకుంటోంది.
గ్లామర్‌తో కవ్విస్తోందిగా
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ప్రియా ప్రకాశ్ వారియర్.. వెండితెరపై గ్లామర్ షో చేయడానికి ఉత్సాహంగా వస్తోంది. అలాగే, సోషల్ మీడియాలో ఈ అమ్మడు అదిరిపోయే హాట్ షోతో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇలా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కవ్విస్తోంది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ రెట్టింపు అవడంతో పాటు తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
బోల్డు ఫొటోలతో రచ్చ
మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె నెట్ డ్రెస్‌లో విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఈ పిక్‌లలో పైన అందాలు మొత్తం కనిపించేలా ఘాటు ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











