BRO హీరోయిన్‌కు చేదు అనుభవం: ప్రైవేటు పార్టుల గురించి మరీ నీచంగా!

టాలీవుడ్‌లో ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటూ ప్రభావాన్ని చూపించగలుగుతున్నారు. అలాంటి వారిలో ముద్దుగుమ్మ కేతిక శర్మ ఒకరు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క హిట్‌ను అందుకోకున్నా.. అవకాశాలను మాత్రం బాగానే రప్పించుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా 'బ్రో' మూవీలో నటించింది. ఇక, తాజాగా కేతిక శర్మ తన జీవితంలో జరిగిన చేదు విషయాల గురించి బయటపెట్టింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

ఆ వీడియోతో సెన్సేషన్‌గా:సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందే ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఈ క్రమంలోనే 2016లో వచ్చిన 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోను చేసింది. దీనికి ఊహించని విధంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఫలితంగా కేతిక శర్మ పేరు తెగ హైలైట్ అవడంతో ఆమెకు క్రేజ్ ఏర్పడింది.

 Bro Heroine Ketika Sharma Comments on Body Shaming

పూరీ కొడుకుతో మొదలెట్టి:యూట్యూబ్‌ వీడియోల వల్ల కేతిక శర్మకు చాలా భాషల నుంచి సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ బొద్దుగుమ్మ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. అయితే, ఈ చిత్రం ఆమెకు హిట్‌ను ఇవ్వలేదు. కానీ, ఇందులో కేతిక అందం, అభినయానికి తెలుగు కుర్రాళ్లు ఫిదా అయిపోయారని చెప్పాలి.

వరుసగానే.. హిట్ రాలేదు:టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయిన కేతిక శర్మ.. ఆ తర్వాత కూడా ఆఫర్లను బాగానే అందుకుంది. ఈ క్రమంలోనే ఆమె నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'లోనూ హీరోయిన్‌గా నటించింది. కానీ, ఇది కూడా సక్సెస్‌ను సాధించలేదు. దీని తర్వాత కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ చేసినా.. ఇవేమీ హిట్ అవలేదు.

 Bro Heroine Ketika Sharma Comments on Body Shaming

బ్రో మూవీతో మంచి పేరు:టాలీవుడ్‌లో కేతిక శర్మ ఇప్పటి వరకూ చాలా సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెను సక్సెస్ ట్రాక్ మాత్రం ఎక్కించలేదు. అయినప్పటికీ ఇప్పుడు ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన 'బ్రో' మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఇందులో తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. తద్వారా మంచి పేరును సంపాదించుకుంది.

కేతికకు చేదు అనుభవం:ప్రస్తుతం 'బ్రో' మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న కేతిక శర్మ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ న్యూస్ ఛానెల్‌తో చిట్ చాట్ చేసింది. ఇందులో తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను బయట పెట్టింది. ఈ క్రమంలోనే గతంలో తనకు చేదు అనుభవాలు ఎదురైనట్లుగా కేతిక శర్మ తొలిసారి రివీల్ చేసింది.

 Bro Heroine Ketika Sharma Comments on Body Shaming

డ్రమ్ములా ఉన్నావంటూ:తాజా ఇంటర్వ్యూలో కేతిక శర్మ మాట్లాడుతూ.. 'నేను సినిమాల్లోకి రాకముందు నుంచే బాడీ షేమింగ్ కామెంట్లను ఎదుర్కొన్నాను. ముఖ్యంగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్న సమయంలో చాలా మంది నన్ను డ్రమ్ములా ఉన్నావు అంటూ కామెంట్ చేశారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాను. అది నన్ను చాలా బాధించింది' అని చెప్పుకొచ్చింది.

 Bro Heroine Ketika Sharma Comments on Body Shaming

ప్రైవేట్ పార్టుల గురించి:ఇదే ఇంటర్వ్యూలో కేతిక శర్మ 'నేను హీరోయిన్ అయిన తర్వాత ఎంతో మంది నా ప్రైవేటు పార్టులు, సైజుల గురించి చాలా పచ్చిగా కామెంట్లు చేస్తున్నారు. వాటిని చూస్తే చాలా బాధగా ఉంటుంది. కానీ, నా పని మీద ఫోకస్ చేయమని అందరూ నాకు సలహాలు ఇస్తున్నారు. అలా నాపై వచ్చే ట్రోల్స్‌ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను' అని వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X