టూ పీస్‌లో కేతిక టూమచ్ షో.. అందాల తెర తీసేసింది బ్రో
సినీ రంగంలో సాధారణంగా హీరోయిన్లు విజయాలను అందుకుంటేనే కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తుంటారు. అలాంటిది కొందరు మాత్రం హిట్లు లేకున్నా హవాను చూపిస్తుంటారు. అందులో ముద్దుగుమ్మ కేతిక శర్మ పేరు ముందుగానే చెప్పాలి. దీనికి కారణం ఆమె హీరోయిన్‌గా ఒక్క సక్సెస్‌ను సొంతం చేసుకోకున్నా.. అవకాశాలను మాత్రం ఓ రేంజ్‌లో అందుకుంటోంది. ఫలితంగా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇక, సోషల్ మీడియాలో సందడి చేసే కేతిక తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి!
అలా సెన్సేషన్‌గా మారింది:ముద్దుగుమ్మ కేతిక శర్మ మోడల్‌గా ఉన్న సమయంలోనే సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారింది. ఆ తర్వాత 2016లో వచ్చిన 'థగ్ లవ్' అనే వీడియోతో సెన్సేషన్ అయిపోయింది. ఈ వీడియోకు భారీ స్థాయిలో స్పందన లభించింది. దీంతో కేతిక శర్మ పేరు తెగ హైలైట్ అవడంతో ఆమెకు క్రేజ్ ఓ రేంజ్‌లో ఏర్పడింది. అప్పటి నుంచే ఈ బ్యూటీకి సినిమా ఛాన్స్‌లు పోటెత్తాయి.

రొమాంటిక్‌గా ఎంట్రీ ఇచ్చి:సోషల్ మీడియా వల్ల ఎనలేని క్రేజ్‌ను దక్కించుకున్న కేతిక శర్మ.. పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అయితే, ఈ చిత్రం ఆమెకు హిట్‌ను ఇవ్వలేదు. కానీ, ఇందులో కేతిక అందం, అభినయానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ఈ చిత్రంతో ఆమె క్రష్‌గానూ మారిపోయింది.
వరుస సినిమాలు చేసినా:హీరోయిన్‌గా మొదటి చిత్రమే నిరాశ పరిచినా కేతిక శర్మకు అవకాశాలు మాత్రం భారీగానే వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'లోనూ హీరోయిన్‌గా చేసింది. కానీ, ఇది కూడా విజయాన్ని సొంతం చేసుకోలేదు. దీని తర్వాత కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ నటించింది. ఇది కూడా సక్సెస్ అవలేదు.

పవన్ మూవీ కూడా నిరాశే:తెలుగులో ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లను దక్కించుకుంటోన్న కేతిక శర్మ.. విజయాలను మాత్రం అందుకోవడంలేదు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన 'బ్రో' మూవీలోనూ కేతిక శర్మ హీరోయిన్‌గా చేసింది. ఇందులో తనదైన నటన, హావభావాలతో ప్రేక్షకులను ఫిదా చేసింది. కానీ, ఈ చిత్రం కూడా డిసప్పాయింట్ చేసింది.

ఎవరూ ఉండనంత బిజీగా:ఆరంభంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన కేతిక శర్మ.. అప్పటి నుంచే అందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. అంతేకాదు, ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది. దీంతో క్రేజ్ కూడా పెరిగిపోతూనే ఉంది.

అస్సలు దాచుకోని కేతిక:సోషల్ మీడియాలో కేతిక శర్మ ఎలా అందాలను ఆరబోస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ ముద్దుగుమ్మ ఇటీవలి కాలంలో విపరీతంగా హాట్ షో చేస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంటోంది. వీటిలో తన అందాలను చూపిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. తద్వారా కేతిక శర్మ తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

కేతిక బోల్డు పిక్స్ వైరల్‌గా:హాట్ లేడీ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. వీటిలో ఈ అమ్మడు టూ పీస్ బికినీ మాత్రమే ధరించి కనిపించింది. అంతేకాదు, వీటిలో విపరీతంగా అందాలను ఆరబోస్తుంది. అలాగే, స్విమ్ చేస్తూ సందడి చేస్తోంది. ఫలితంగా కేతిక షేర్ చేసిన ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











