BRO: బీచ్‌లో బ్రో హీరోయిన్ ఎంజాయ్.. సముద్రంలో సాగర కన్యలా!
ఏ హీరోయిన్ అయినా సినిమాల్లోకి వచ్చేటప్పుడు గ్రాండ్ ఎంట్రీనే దక్కాలని అనుకుంటుంది. కానీ, అలా జరగడం చాలా కష్టమైన పనే అని చెప్పాలి. అలాంటిది కొందరు భామలు ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ అవుతున్నారు. అందులో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు.
ఫస్ట్ మూవీలోనే అదిరిపోయే యాక్టింగ్, మేనరిజంతో దేశం మొత్తం పాపులర్ అయిన ఈ చిన్నది.. అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్‌ను సాగిస్తోంది. ఇప్పుడు ఏకంగా పవన్ సినిమాలో భాగమైంది. ఇక, తాజాగా ప్రియా వారియర్ కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి!

కన్నుగీటి.. కిస్ గన్‌తో రచ్చ: ప్రియా ప్రకాశ్ వారియర్ టీనేజ్ లవ్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో ఈ అమ్మడు కన్నుగీటడంతో పాటు కిస్ గన్ సీన్‌తో ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. దీంతో ఈ సినిమా చాలా లాగ్వేజ్‌లలోకి అనువాదం కూడా అయింది. ఫలితంగా ప్రియా వారియర్‌కు అన్ని భాషల నుంచి ఆఫర్లు వచ్చాయి.

సినిమాల మీద సినిమాలు: ఫస్ట్ మూవీతోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. ఆ తర్వాత నేరుగా తెలుగులోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే నితిన్‌తో 'చెక్' అనే మూవీ చేసింది. కానీ, ఇది ఆశించిన రీతిలో ఆడలేదు. కానీ, ఆ తర్వాత తేజ సజ్జాతో కలిసి 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' మూవీ చేసింది. ఇది మాత్రం ప్రేక్షకుల మన్ననలు పొందడంతో పాటు ఆమెకూ పేరు తెచ్చింది.
హిందీలోనే.. ఇప్పుడు ఫుల్: ప్రియా ప్రకాశ్ వారియర్ ఏకంగా బాలీవుడ్‌లో 'శ్రీదేవి బంగ్లా' అనే బాలీవుడ్ మూవీ చేసింది. అయితే, ఇది విడుదల కాలేదు. అయినా ఆ తర్వాత ఈ భామ మలయాళం, బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేసింది. ఇప్పుడు కూడా హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్', 'యారియన్ 2' చిత్రాల్లో నటిస్తోంది. అలాగే, ప్రియా కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీ చేస్తోంది.

పవన్ మూవీలో.. ఫుల్ బిజీ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపొందిన 'BRO' మూవీలోనూ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించింది. ఇందులో ఆమె ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమా జూలై 28న రిలీజ్ కాబోతుండడంతో ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఇలా కొద్ది రోజులుగా ఫుల్ బిజీగా గడుపుతోంది.

అక్కడ మాత్రం యాక్టివ్‌గా: పేరుకు మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన అమ్మాయే అయినా ప్రియా ప్రకాశ్ వారియర్.. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను ఖుషీగా ఉంచుతోంది.

డోస్ పెంచుతూనే ఉంది: మొదటి చిత్రం నుంచి బోల్డుగా నటిస్తోన్న ప్రియా ప్రకాశ్ వారియర్.. గ్లామర్ షో చేయడానికి కూడా అస్సలు వెనుకాడడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు అదిరిపోయే హాట్ షోతో కుర్రకారును హుషారెక్కిస్తోంది. ఇలా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడి ఫాలోయింగ్ పెరిగి.. సెన్సేషన్‌గా మారిపోతూనే ఉంది.

బికినీలో బ్రో హీరోయిన్: యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె సముద్రంలో బికినీ ధరించి యమా హాట్ షో చేస్తోంది. ఈ పిక్‌లలో ఆమె అందాలు బాగా కనిపించేలా ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా ఇవన్నీ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











