బ్రోకరేజ్ గొడవ: హీరోయిన్ కంగన మీద కేసు నమోదు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి మీద ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముంబైలోని పాలీహిల్‌లో గత ఏడాది ఆమె రూ. 20.07 కోట్లు పెట్టి ఓ ఇంటిని కొనుగోలు చేసింది. అయితే ఈ కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి ప్రకాశ్ జీ రోహిర తనకు ఒప్పందం ప్రకారం తనకు బ్రోకరేజ్ చెల్లించలేదని కేసు పెట్టారు.
ఈ వివాదంపై కంగన రనౌత్ ప్రతినిధులు స్పందించారు. ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన 1 శాతం బ్రోకరేజ్ మొత్తం రూ. 20 లక్షలు చెల్లించామని, కానీ ఇప్పుడు ఆయన 2 శాతాన్ని బ్రోకరేజ్ డిమాండ్ చేస్తున్నాడని తెలిపారు.

2017 సెప్టెంబర్ మాసంలో కంగనా రనౌత్ 3,075 చదరపు అడుగుల బంగ్లాను రూ. 20.07 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందుకుగాను రూ. 1.03 కోట్ల స్టాంప్ డ్యూటీ సైతం చెల్లించింది. అంతా సక్రమంగా జరిగినా ఇపుడు బ్రోకరేజ్ వ్యవహారంతో కేసు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఈ వివాదంపై కంగనా రనౌత్ ఓ పత్రికతో మాట్లాడుతూ... మా ఫైనాన్స్ టీమ్ ఈ విషయాన్ని డీల్ చేస్తోంది. మాపై ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఇండస్ట్రీ స్టాండర్ట్స్ ప్రకారం 1 శాతం బ్రోకరేజ్ చెల్లించాం. ఇపుడు అతడు 2 శాతం అడుగుతున్నాడు. అతడికి డబ్బు చెల్లించినట్లు మా వద్ద అన్ని ఆదారాలు ఉన్నాయి అన్నారు.


Click it and Unblock the Notifications











