అక్కడ పిసికేసాడు .. హీరో అయితే భరించాలా? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావంటూ కేరళ ప్రభుత్వం నియమించిన జస్టిస్ హేమ కమిటీ బయటపెట్టిన నిజాలు గతేడాది చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. కేరళలో మహిళా నటులు దయనీయ స్థితిలో ఉన్నారని హేమ కమిటీ పేర్కొంది. మలయాళ ఇండస్ట్రీ అనధికారికంగా ఓ మాఫియా కనుసన్నల్లో నడుస్తోందని కమిటీ ఆరోపించింది. మహిళా నటులు తమపై జరిగే లైంగిక వేధింపులు, దాడులపై నోరు విప్పలేకపోతున్నారని నివేదికలో ప్రస్తావించింది.

హేమ కమిటీ నివేదిక తర్వాత పలువురు నటీమణులు ధైర్యంగా ముందుకొచ్చి తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెడుతున్నారు. మలయాళంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన పలువురు హీరోయిన్లు , నటీమణులు కూడా ఒక్కొక్కరిగా తమకు జరిగిన అన్యాయాలను నేటికీ బయటపెడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు కన్నడ నటి సంజన గల్రానీ.

bujjigadu fame sanjana Galrani made sensational comments on kannada star hero

10 అక్టోబర్ 1989న బెంగళూరులో స్థిరపడిన సింధి కుటుంబంలో జన్మించిన సంజన స్థానికంగానే చదువుకున్నారు. విద్యాభ్యాసం తర్వాత మోడలింగ్ వైపు వచ్చిన సంజన.. బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంతో కలిసి చేసిన ఫాస్ట్ ట్రాక్ వాణిజ్య ప్రకటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2005లో రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా నటించిన సొగ్గాడులో చిన్న పాత్ర ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు సంజన గల్రానీ. ఆ తర్వాత తమిళ్‌లో ఒరు కధల్ సేవిర్‌లో నటించారు.

అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు ద్వారా సంజన గల్రానీకి బ్రేక్ దక్కింది. ఆ తర్వాత సత్యమేవ జయతే, పోలీస్ పోలీస్, దుశ్శాసన, ముగ్గురు, యమహో యమ, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలలో నటించారు. కానీ ఇవేవీ ఆమెకు స్టార్ తీసుకురాలేకపోయాయి. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు గడుస్తోంది.

శాండిల్‌వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో సంజన పేరు తైరపైకి రావడంతో పాటు ఆమె అరెస్ట్ కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. లాక్‌డౌన్ సమయంలో అజీజ్ పాషా అనే ఓ డాక్టర్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది సంజన. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, వేధింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు సంజన. తనను కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో తీవ్రంగా వేధించాడని బాంబు పేల్చింది.

bujjigadu fame sanjana Galrani made sensational comments on kannada star hero

ఓ డైరెక్టర్‌తో సదరు హీరోకి గొడవ జరిగిందని.. అతను ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడని అప్పుడే మాపై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారని సంజన తెలిపారు. సీన్ చెప్పగానే హీరో వచ్చి నా భుజాలను గట్టిగా పిపిసికేశాడని.. ఆ నొప్పి భరించలేక, ఇలా చేశావ్ ఏంటని అడగ్గా మేనేజ్ చేసుకో అన్నాడని మండిపడింది. నేను నీతో దెబ్బలు తినడానికి ఇక్కడికి రాలేదని, నేనేమీ రౌడీని కాదని ఇచ్చిపడేసినట్లు సంజన తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషలో మీడియాలో వైరల్ అవుతుండగా.. సంజనను అంతలా వేధించిన హీరో ఎవరు ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X