హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తే అలాంటి కండీషన్లు... తెలుగు నటిపై బన్నీ వాసు కామెంట్స్

తెలుగు చిత్రాల్లో తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు రావడం లేదంటూ పలువురు హీరోయిన్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఐశ్వర్య రాజేష్, అంజలి, శ్రీదివ్య, ఆనంది వంటి వారు టాలీవుడ్‌ను పక్కనపెట్టి కోలీవుడ్‌లో సత్తా చాటారు. అయితే గత కొంతకాలంగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా ఫోక్ సింగర్స్, డ్యాన్సర్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. రాను బొంబాయి రాను ఫేమ్ లిఖిత ఇటీవల హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకోగా.. మరో ఫోక్ సింగర్ నాగదుర్గ కూడా హీరోయిన్‌గా అవకాశం అందుకున్నారు.

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నాగదుర్గ. సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమెకు హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. బన్నీ వాసు వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఇడుపు కాయితం మూవీలో నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివజ్యోతి, జోర్దార్ సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Bunny Vasu Interesting comments on Folk Singer Nagadurga at Idupu Kaitham

తెలంగాణ సంస్కతి, కుటుంబ బంధాలు బ్యాక్‌డ్రాప్‌లో ఇడుపు కాయితం మూవీని తెరకెక్కించనున్నారు. గురువారం ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. దిల్‌రాజు, అల్లు అరవింద్, సుకుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరై పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా పట్టాలెక్కడానికి తబిత గారే కారణం. ఈ సినిమా రిలీజయ్యాక.. అమ్మాయి అయితే వాళ్ల అత్తామామలను తీసుకుని థియేటర్స్‌కి వెళ్లండి, అబ్బాయి అయితే మాత్రం వాళ్ల అత్తామామలను తీసుకుని సినిమాకు వెళ్లండి. బయటికి వచ్చినప్పుడు మాత్రం అత్త కోడలి చేతిని పట్టుకుంటుంది.. అదే అల్లుడైతే మాత్రం మామగారు చేతిని పట్టుకుంటారు అని బన్నీ వాసు తెలిపారు.

ఈ సినిమాలో నటిస్తున్న వారు వారి లైఫ్‌లో చాలా బిజీగా ఉంటారు. వంశీగారు కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ల కోసం మిగతావి వదులుకుని అయినా సినిమా చేస్తామన్నారు. నేను ఎంత ఇస్తే అంత తీసుకుని చేస్తున్నారు. వంశీ వరంగల్ దగ్గర జమ్మికుంటలో పుట్టాడు, ఆ ఏరియా గురించి చెబుతుంటే ఆ వూరు నా కళ్లముందే కనిపించింది. త్వరలో చాలామంచి తెలుగు సినిమాను చూడబోతున్నామని బన్నీ వాసు చెప్పారు.

నాగదుర్గను పిలిచి మా సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నామని చెప్పా.. ఇప్పటికీ చాలా సినిమాలు చేశాను, సుకుమార్ గారు ఉన్నారు కదా మనం పిలిచిన వెంటనే హ్యాపీగా ఒప్పుకుంటుందని అనుకున్నా. నాకు 15 రూల్స్ పెట్టింది ఈ అమ్మాయి. కానీ ఫస్ట్ టైం ఒక తెలుగు అమ్మాయితో డీల్ చేస్తుంటే ఒక తెలుగు అమ్మాయి సినిమా విషయంలో ఎంత క్లారిటీగా ఉంటుందనేది నాగదుర్గను చూసినప్పుడే అనిపించింది. ఈ అమ్మాయి వల్ల మేమందరం మారాం. ఈ సినిమాకు నాగదుర్గ చాలా ప్లస్ అవుతుంది, ఆ అమ్మాయి యూట్యూబ్‌లో పెద్ద స్టార్. త్వరలో వెండితెరను ఇరగ్గొట్టబోతోంది. ఈ అమ్మాయి కోసం స్పెషల్‌గా మ్యూజిక్ బిట్ చేయమని చెప్పాం.. దానికి మాత్రం స్క్రీన్లు చినిగిపోయేలా ఖచ్చితంగా ఔట్‌పుట్ ఇస్తుంది. ఈ కథను ప్రియదర్శి గారే నా దగ్గరికి తీసుకొచ్చారు. కథ విన్నాక నేనుండే బిజీ లైఫ్‌లో దీనిని మిస్ అయితే చాలా మిస్ అవుతాను అని అనిపిస్తోందని బన్నీ వాసు ఆకాంక్షించారు.

Read more about: bunny vasu priyadarshi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X