మరో సౌత్ స్టార్ తో మూవీకి జాన్వీ గ్రీన్ సిగ్నల్?
ప్రస్తుతం సినిమాల విషయంలో భాషల సరిహద్దులు చెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నార్త్ తో పాటు సౌత్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. తాజాగా జాన్వి మరో సౌత్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఈ బ్యూటీ ఈసారి ఏ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతుంది అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.
ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలో సౌత్ నార్త్ అనే గీత పూర్తిగా చెరిగిపోయింది. నార్త్ లో స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్న సెలబ్రిటీలు అందరూ సౌత్ లో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అలాగే హీరోయిన్లు కూడా సౌత్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ విషయంలో జాన్వి ఇప్పటికే ఓ అడుగు ముందుంది.

ఇప్పటికే రెండు తెలుగు పాన్ ఇండియా సినిమాలలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిన జాన్వి తాజాగా ఓ కోలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. అది కూడా శింబుతో ఆమె రొమాన్స్ చేయబోతుందని టాక్ నడుస్తోంది.
కోలీవుడ్ స్టార్ శింబు ప్రస్తుతం కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నం తెరకెక్కిస్తున్న థగ్ లైఫ్ లో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లో ఆయన బిజీగా ఉండగా, శింబు నెక్స్ట్ మూవీ గురించి అప్పుడే రూమర్లు స్టార్ట్ అయ్యాయి.
ఎస్టిఆర్ 48 అంటూ వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ మూవీ షూటింగ్ జూన్ చివర్లో ప్రారంభం కానుందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో శింబు సరసన ద్విపాత్రాభినయం చేయడానికి జాన్వి కపూర్ ను మేకర్స్ సంప్రదించినట్టుగా తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించడానికి జాన్విని నిర్మాతలు ఒప్పించినట్టుగా వార్తలు విన్పిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే జాన్వి కపూర్ కు ఇదే కోలీవుడ్ లో ఫస్ట్ మూవీ అవుతుంది.
అయితే ఇంకా దీనిపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాకపోవడంతో అసలు జాన్వి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అనే విషయంపై అభిమానంలో ఉత్కంఠత నెలకొంది. ఇంతకు ముందు ఈ పాత్ర కోసం కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్, దీపికా పదుకొనే వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి.
కానీ ఇప్పుడు మాత్రం కియారా అద్వానీ, జాన్వి కపూర్ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తాజా అప్డేట్ ప్రకారం జాహ్నవి కపూర్ ఫైనల్ అయినట్టుగా టాక్ నడుస్తోంది. మరోవైపు జాన్వి ఇప్పటికే ఎన్టీఆర్ తో దేవ, రామ్ చరణ్ తో బుచ్చిబాబు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











