సొంత ఛానల్ ఓపెన్ చేసిన హీరోయిన్, ఇక హాట్ వీడియోలతో మంచెత్తుతుందేమో?

ఇప్పటి వరకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలపైనే ఆసక్తిచూపిన బాలీవుడ్ తారలు ఇపుడు యూట్యూబ్ లాంటి వాటిలో అకౌంట్స్ తెరిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అలియా భట్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తమ సొంత యూట్యూబ్ ఛానెళ్లను ప్రారంభించారు. వారిని అనుసరిస్తూ దిశా పటాని కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది.

తాను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ... "నా మొదటి యూట్యూబ్ వీడియోను మీ అందరితో పంచుకోవడానికి వేచి ఉండలేకపోతున్నాను. నేను చిత్రీకరించిన వీడియోలు మీరు అందరూ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ఇకపై సరికొత్త వీడియోలు మీతో పంచుకోబోతున్నాను' అని ట్వీట్ చేశారు.

Cant wait to share my first YouTube video with all of you: Disha Patani

దిశా పటానీ సినిమా కెరీర్ విషయానికొస్తే.. తెలుగు మూవీ 'లోఫర్' ద్వారా ఆమె తెరంగ్రేటం చేశారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. ఆ తర్వాత హిందీలో 'ఎంఎస్ ధోని', భాగీ 2, భారత్ చిత్రాల్లో నటించింది. కుంగ్ ఫు యోగా అనే చైనీస్ మూవీలో కూడా ఆమె నటించారు.

దిశా చివరి చిత్రం 'భారత్' బ్లాక్ బస్టర్ విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలో దిశా పటానీ 'మలాంగ్' షూటింగ్‌లో బిజీగా ఉంది. మోహిత్ సూరి దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్, కునాల్ కేము నటిస్తున్నారు. మాలాంగ్ 2020 వాలెంటైన్స్ డేకు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X