సమంత ఒక్క అడుగేస్తే లక్ష రూపాయలు.. తస్పాదియ్యా ఏ మాత్రం తగ్గట్లేదుగా!
సినీ తారల సంపాదన లక్షల్లో మొదలుపెట్టి కోట్ల వరకు ఉండటం వారి హోదాను బట్టి ఉంటుంది. అందుకు తగినట్టే వారి ఖర్చులు, అభిరుచులు కూడా భారీగానే ఉంటాయి. హీరో, హీరోయిన్లు కొనుగోలు చేసే బట్టలు, నగలు, ఇతర వస్తువులు కూడా చాలా ఖరీదుగానే ఉంటాయి. తాజాగా సమంత అక్కినేని ధరించే చెప్పుల (హీల్స్) ధర మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ చెప్పుల ధర ఎంతంటే..

సమంత అక్కినేని పాదరక్షల ధర ఎంతంటే
సమంత తన బాహ్య సౌందర్యానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారనే విషయాన్ని కొత్తగా చెప్పుకోనవసరం లేదు. ఇటీవల ఓ మొబైల్ కంపెనీ నిర్వహించిన ఈవెంట్‌కు సమంత హాజరుకాగా, అందరి దృష్టి ఆమె ధరించిన ఖరీదైన చెప్పులపై పడింది. ఎందుకంటే వాటి ధర సుమారు లక్ష రూపాయలు ఉండటమే.

మోనోలో బ్లాహ్నిక్ కంపెనీ ఉత్పత్తి
సమంత అక్కినేని ధరించే నల్లటి హీల్స్ ప్రఖ్యాత చెప్పుల తయారీ సంస్థ మోనోలో బ్లాహ్నిక్‌కు చెందినవి. ఇది స్పానిష్ బ్రాండ్ కంపెనీ. పాదానికి తగినట్టుగా ఒదిగిపోవడం ఈ హీల్స్ ప్రత్యేకత. టాప్ సెలబ్రిటీలు అతి తక్కువ మంది వీటిని ధరిస్తారని చెప్పుకొంటారు.

రాజధాని లిమాలో తయారీ
మోనోలో బ్లాహ్లిక్ తయారు చేస్తే ఉత్పత్తుల్లో బ్లాక్ హంగీసి బకల్ సాటిన్ పంప్స్ అనే ప్రత్యేకమైన పాదరక్షలను ధరిస్తుంది. మార్కెట్‌లో వాటి ధర 92 వేల నుంచి 99 వేల వరకు ఉంటుంది. ఇవి ప్రత్యేకంగా పెరు రాజధాని లిమాలో దొరుకుతాయి.

చైతూతో మజిలీ
ప్రస్తుతం సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి మజిలి అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానున్నది. అలాగే తమిళంలో సూపర్ డీలక్స్ అనే చిత్రంలో కనిపించనున్నది. అలాగే దిల్ రాజు నిర్మించే ఓ చిత్రంలో శర్వానంద్‌కు జంటగా నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











