తెలంగాణ ఎన్నికలు: నచ్చకపోతే ‘నోటా’ నొక్కమంటున్న క్యాథరిన్

తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లను చైతన్య పరుస్తూ హీరోయిన్ కేథరిన్ ఓ వీడియో విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఎవరూ ఓటును వృధా చేయవద్దని తెలిపారు.

రాష్ట్ర భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు కూడా మీరు వేసే ఓటులోనే ఉంటుందని, ఓటు వేయడం అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పని అని సూచించారు. ఒక వేళ మీకు బరిలో నిల్చున్న వ్యక్తులు ఎవరూ నచ్చకపోతే 'నోటా' నొక్కాలని, అంతే కానీ ఓటు వేయకుండా వృధా చేయవద్దని కోరారు.

Catherine Tresa about Telangana election and vote importance

కేథరిన్ పోస్టు చేసిన ఈ వీడియోపై అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఓటు ప్రధాన్యత గురించి ప్రజలకు వివరించడం, వారిని ఓటు వేసేలా చైతన్య పరచడంపై పలువురు ఆమెను అభినందిస్తున్నారు.

కేథరిన్ సినిమాల విషయానికొస్తే... తమిలం, మళయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. తమిళంలో ఆమె నటిస్తున్న నీయా 2, వెంత రాజావంతాన్ వరువేన్‌తో పాటు మరో మలయాళ చిత్రం చిత్రీకరణ దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X