బోయపాటి సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకున్న హీరోయిన్.. సరైన హిట్ లేకున్నా ఇంతా.!
ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయాడు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. దాదాపు తెలుగులోని అందరు హీరోలతో పని చేసిన ఈయన.. చాలా కాలంగా సినిమాను స్టార్ట్ చేయకుండా ఉండిపోయాడు. ఈ ఏడాది ఆరంభంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేసిన 'వినయ విధేయ రామ' తప్ప మరో సినిమాను పట్టాలెక్కించలేదు. ఈ మూవీ ఘోర పరాజయాన్ని చవి చూడడంతో బోయపాటి సైలెంట్‌గా ఉండిపోయారని అంతా అనుకున్నారు. అయితే, ఆయన.. నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. బోయపాటి ఓ సెంటిమెంట్ వల్ల ఓ హీరోయిన్ క్యాష్ చేసుకుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరా హీరోయిన్..?

హ్యాట్రిక్ కొట్టేయాలన్న కసితో చేస్తున్నారు
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్లిద్దరి కలయికలో గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ క్రమంలోనే త్వరలో మరో సినిమాను ప్రారంభించనున్నారు. ఈ సినిమాతో కూడా హిట్ కొట్టేసి హ్యాట్రిక్ నమోదు చేయాలని ఈ ఇద్దరు స్టార్లు కసిగా ఉన్నారట.

ఎన్నో ఊహాగానాలు.. ఎందరివో పేర్లు
క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. అదే సమయంలో ఎందరివో పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ సినిమాలో పలానా నటుడు కీలక పాత్ర చేస్తున్నాడని కొందరు అంటుంటే.. పలానా హీరోయిన్ నటిస్తుందని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో షూటింగ్‌కు ముందే ఈ మూవీ ట్రెండ్ అవుతోంది.

హీరోయిన్‌గా చేయడం లేదని ట్వీట్
మరీ ముఖ్యంగా ఈ సినిమా నటించే హీరోయిన్ గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పేరు బలంగా వినిపించింది. దీంతో ఆమె స్వయంగా దీనిపై స్పందించింది. ‘అందరూ అనుకుంటున్నట్లు నేను నందమూరి బాలకృష్ణ సినిమాలో నటించడం లేదు' అని ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చేసింది.

సెంటిమెంట్ ప్రకారం ఆమెను తీసుకున్నాడు
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకో లేక మరేదైన ముఖ్యమైన క్యారెక్టర్‌కో తెలియదు కానీ... గతంలో తన ‘సరైనోడు', ‘జయ జానకీ నాయక' సినిమాల్లో నటించిన కేథరిన్‌ను ఈ మూవీ కోసం బోయపాటి సంప్రదించాడని సమాచారం. దీనికి ఆమె కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని టాక్.

సరైన హిట్ లేకున్నా ఇంతా.!
బాలకృష్ణతో నటించే సినిమా కోసం కేథరిన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి కూడా ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నటించేందుకు ఆమె రూ. కోటి డిమాండ్ చేసిందని తెలిసింది. దీనికి బోయపాటి ఎన్నో చర్చల తర్వాత రూ. ఎనభై లక్షలకు సెటిల్ చేశాడని అంటున్నారు. సరైన హిట్ ఒక్కటి కూడా లేకున్నా బోయపాటి సెంటిమెంట్ వల్లే ఆమెకు ఇంత ఇస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











