Catherine Tresa : పొట్టి గౌనులో ఎమ్మెల్యేగారి పరువాల విందు .. లాంగ్ గ్యాప్ తర్వాత హాట్ షో
దశాబ్థాలుగా తెలుగు తెరపై కేరళ కుట్టిలు రాణిస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో మలయాళ ముద్దుగుమ్మలు టాలీవుడ్‌ను ఏలుతున్నారు. ప్రస్తుతం నిత్యమీనన్, సంయుక్త మీనన్, కీర్తి సురేష్, ఐశ్వర్య మీనన్, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు ఇండస్ట్రీని ఒక ఊపుతున్నారు. ఈ కోవకే చెందుతారు కేథరిన్ థ్రెస్సా. ఎప్పుడో పదేళ్ల క్రితమే టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత స్టార్ డమ్ దక్కలేదు.
10 సెప్టెంబర్ 1989న దుబాయ్‌లో జన్మించారు కేథరిన్ థ్రెసా. ప్రాథమిక విద్యను దుబాయ్‌లోనే పూర్తి చేసిన ఆమె బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. చదువుతో పాటు కల్చరల్ ఈవెంట్స్‌లో యాక్టీవ్‌గా ఉండే కేథరిన్ .. పియానో వాయించడం నేర్చుకున్నారు. అలాగే ఈమె సింగింగ్, డ్యాన్సింగ్, ఐస్ స్కేటింగ్, డిబేటింగ్‌లో నిష్ణాతురాలు. పర్యావరణ కార్యకర్తగానూ సమాజానికి సేవలందిస్తున్నారు కేథరిన్.

మోడలింగ్‌లో దిగిన కేథరిన్.. నల్లి సిల్క్స్, చెన్నై సిల్క్స్, ఫాస్ట్ ట్రాక్, డెక్కన్ క్రానికల్ తదితర సంస్థలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో నటించారు. 2010లో కన్నడ చిత్రం శంకర్ ఐపీఎస్ ద్వారా చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత మలయాళ సినిమాలలో నటించిన ఆమె 2013లో చమ్మక్ చల్లో సినిమా ద్వారా తెలుగువారిని పలకరించారు. ఆ వెంటనే ఇద్దరమ్మాయిలతో చిత్రంలో ఏకంగా అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం దక్కించుకున్న కేథరిన్.. తర్వాత పైసా, ఎర్రబస్సు, రుద్రమదేవి సినిమాలలో నటించారు.
ఈ దశలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడులో ఎమ్మెల్యేగా ఆకట్టుకున్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యే అంటేనే కేథరిన్ అన్నంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం చేసిన గౌతమ్ నంద, జయ జానకీ నాయక చిత్రాల్లో కనిపించిన ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. తర్వాత పూర్తిగా తమిళ ఇండస్ట్రీ పైనే ఫోకస్ పెట్టిన కేథరిన్ తెలుగును పక్కనపెట్టేసింది. 2020లో వరల్డ్ ఫేమస్ లవర్‌తో తిరిగి టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది కేథరిన్.
భలా తందనాన, బింబిసార, మాచర్ల నియోజకవర్గం, వాల్తేర్ వీరయ్య సినిమాలతో అలరించారు కేథరిన్. ఆ తర్వాత మళ్లీ కొత్తగా ఏ సినిమాను ఆమె ప్రకటించలేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ కేథరిన్‌కు అనుకున్నంత స్థాయి రాలేదు. తన కంటే వెనుక వచ్చిన అమ్మాయిలు స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నా ఆమె మాత్రం వెనుకబడిపోయారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కేథరిన్ థ్రెసా తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా పొట్టి డ్రెస్ వేసుకుని చేసిన ఫోటో షూట్‌ను ఆమె కేథరిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











