catherine tresa బీచ్‌లో కేథరిన్ త్రెసా హల్‌చల్.. చిల్ మారో అంటూ పొట్టి బట్టల్లో!

ఈ మధ్య కాలంలో అవకాశాలు రాని భామలు స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు. తమకు అనుకున్న రీతిలో అవకాశాలు రావడం లేదు అనుకుంటున్న సమయంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ దర్శకనిర్మాతల కళ్ళల్లో పడటమే కాక సోషల్ మీడియాలో అభిమానుల వద్ద కూడా క్రేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమ తమ హాట్ ఫోటో షూట్లు వదులుతున్న సంగతి తెలిసిందే. ఆ లిస్టులో అందాల భామ క్యాథరిన్ తెరెసా కూడా వచ్చి చేరారు. తాజాగా ఆమె చిల్ మారో షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు

 మోడలింగ్ మొదలుపెట్టి

మోడలింగ్ మొదలుపెట్టి

దుబాయ్లో సెటిలైన మలయాళం దంపతులకు జన్మించింది క్యాథరిన్ తెరెసా. ఇక్కడే ఇంటర్ వరకు చదువుకున్న ఆమె తర్వాత పై చదువుల కోసం బెంగళూరు వచ్చింది. బెంగళూరు వచ్చిన సమయంలో ఒక పక్క చదువుకుంటూ మరో పక్క ఆమె నటన మీద ఆసక్తి కారణంగా సింగింగ్, డాన్సింగ్ వంటి విషయాలలో శిక్షణ కూడా తీసుకుంది. అలా ఆమె చదువుకుంటూనే ఆమె కొన్ని బట్టల షాపులు కోసం అలాగే కొన్ని మంచి బ్రాండ్స్ కోసం మోడలింగ్ చేయడం మొదలుపెట్టింది.

ఇద్దరమ్మాయిలతో

ఇద్దరమ్మాయిలతో

అలా మోడలింగ్ చేస్తున్న సమయంలో ఆమెకు సినీ అవకాశాలు తలుపు తడతాయి. కన్నడ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత మలయాళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. చమ్మక్ చల్లో అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇద్దరమ్మాయిలతో సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన పైసా, ఎర్రబస్సు వంటి సినిమాలు పెద్దగా ఆడలేదు.

భళా తందనాన

భళా తందనాన

ఆ తర్వాత రుద్రమదేవిలో ఆమె చేసిన పాత్రకు మంచి ప్రాధాన్యత తగ్గింది. ఇక ఆ తర్వాత సరైనోడులో ఎమ్మెల్యే క్యారెక్టర్ లో కూడా ఆమె అదరగొట్టింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయని చెప్పాలి దీంతో ఆమె నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేసింది. ఇక తరువాత జయ జానకి నాయక సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసింది. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్, భళా తందనాన, సినిమాల్లో కనిపించింది.

థైస్ షోతో

థైస్ షోతో

ప్రస్తుతం ఆమె చేతిలో బింబిసార, మాచర్ల నియోజకవర్గంలో సినిమాల్లో నటిస్తోంది. తాజాగా కేథరిన్ షేర్ చేసిన హాట్ ఫోటోలు వైరల్ అవుతోంది. ఆమె ఎప్పటిలానే కిల్లర్ హాట్ లుక్ తో మైండ్ బ్లాక్ చేసింది. గతంలో కంటే కేథరిన్ ఈ ఫోటోలో కాస్త బొద్దుగా కనిపించినా అదిరిపోయే థైస్ షోతో రచ్చ రేపుతోంది.

డెనిమ్స్ ధరించి

డెనిమ్స్ ధరించి

అంతే కాక ఒక చిట్టి పొట్టి చినుగుల డెనిమ్స్ ధరించి ఆపై ఫ్లోరల్ టాప్ ధరించి ఆ కాళ్లకు రెడ్ బూట్స్ ని మ్యాచింగ్ గా వేసుకుని మరీ దానికిమై చిల్ మారో అవతార్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది కేథరిన్. మాచర్ల నియోజకవర్గం నుంచి లేటెస్ట్ సాంగ్ లుక్ ఇది అని వెల్లడించింది. స్నీక్ పీక్ విడుదలైంది... గో చెక్ ఇట్ ఔట్! అంటూ అభిమానులకు ట్రీట్ రెడీ అని చెబుతుంది. ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X