బన్నీకి జోడి కోసం కొనసాగుతున్న కసరత్తు.. తెరపైకి హ్యాట్రిక్ హీరోయిన్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, రాధాకృష సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్ గా చెబుతున్నారు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కథకు తుదిమెరుగులు దిద్దుతూ నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు.
అల్లు అర్జున్ సరసన నటించే హీరోయిన్ విషయంలో మాత్రం సందిగ్దత తొలగడం లేదు. మొదట కైరా అద్వానీ పేరు వినిపించింది. ఆ తర్వాత పూజా హెగ్డే ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా బన్నీ సరసన హ్యాట్రిక్ చిత్రాల్లో నటించిన కేథరిన్ పేరు తెరపైకి వచ్చింది. తివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రంలో హీరోయిన్ గా కేథరిన్ ని కూడా పరిశీలిస్తున్నర్లు వార్తలు వస్తున్నాయి.

కేథరిన్ అల్లు అల్లు అర్జున్ కు జోడిగా ఇద్దరమ్మాయిలతో, రుద్రమ దేవి, సరైనోడు చిత్రాల్లో నటించింది. హీరోయిన్, ఇతర నటీనటుల విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


Click it and Unblock the Notifications











