రాంచరణ్‌తో ఎమ్మెల్యే స్టెప్పులు.. బోయపాటి మరోసారి!
వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి విడుదలకు సిద్ధం అవుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. బోయపాటి తనదైన శైలిలో మాస్ మసాలా అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వినయ విధేయ రామ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ఐటెం సాంగ్ ని అందించినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లో రాంచరణ్ పక్కన స్టెప్పులేసి హాట్ బ్యూటీ కోసం చిత్ర యూనిట్ వేట మొదలు పెట్టింది.
వినయ విధేయ రామ చిత్రంలో ఇలియానా ఐటెం సాంగ్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఇలియానా భారీగా పారితోషకం డిమాండ్ చేయడంతో చిత్ర యూనిట్ వెనక్కు తగ్గింది. తాజాగా కేథరిన్ పేరు తెరపైకి వచ్చింది. కేథరిన్ బోయపాటి తెరకెక్కించిన సరైనోడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అందాల ఎమ్మెల్యేగా కేథరిన్ సరైనోడుతో అదరగొట్టేసింది.

వినయ విధేయ రామ చిత్రంలో ఐటం సాంగ్ కోసం చిత్ర యూనిట్ కేథరిన్ సంప్రదించారట. కేథరిన్ అంగీకారం తెలిపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వినయ విధేయ రామ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. స్నేహ, తమిళ హీరో ప్రశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











