అలాంటి డ్రెస్‌లో తెలుగు హీరోయిన్ నరకయాతన.. లైవ్‌లో అలా కవర్ చేసుకుంటూ
హీరోయిన్ల వస్త్రధారణ గురించి సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అనేక మంది ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ కౌంటర్ ఇవ్వగా.. విషయం మహిళా కమీషన్ వరకు వెళ్లింది. తాను చెప్పాలనుకున్న ఉద్దేశం కరెక్టేనని, కాకపోతే రెండు పదాలు తప్పుగా దొర్లాయని శివాజీ క్షమాపణలు తెలిపారు. అయితే మరికొందరు మాత్రం ఈ వ్యాఖ్యలను సమర్ధించారు. మహిళలు నిండుగా కనిపించాలని శివాజీ కోరుకున్నారని, ఇందులో తప్పేం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ వివాదం ప్రస్తుతం సద్దుమణగగా.. శివాజీ వ్యాఖ్యల గురించి ఎక్కడో ఒకచోట చర్చ జరుగుతూనే ఉంది. ఎవరైనా ఓవర్ గ్లామర్ షో చేస్తున్న సందర్భాల్లో శివాజీ చేసిన వ్యాఖ్యలను మీమ్స్‌గా వదులుతున్నారు.
ఇదిలాఉండగా.. కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించిన నటీనటులను ఎందరో ఫాలో అవుతుంటారు. ఇలాంటి వారు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అదుపు తప్పినా ఎన్నో విమర్శలతో పాటు ట్రోలింగ్ బారిన పడాల్సి వస్తుంది. హావభావాలు, మాటలు, చేతలు చివరికి ధరించే దుస్తుల విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ లైవ్‌లో మాట్లాడుతుండగా ఊహించని ఘటన జరిగింది. పరువు కాపాడుకునేందుకు సదరు బ్యూటీ ఆపసోపాలు పడింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఆ నటి ఎవరో కాదు.. కేథరిన్ థ్రెసా. తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని ఎన్నో కలలలో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు అదృష్టం కలిసిరాలేదు. నటన, అందం పరంగా తనకు తిరుగులేని నిరూపించుకున్నప్పటికీ రిజల్ట్ మాత్రం దక్కలేదు. 2010లో కన్నడ చిత్రం శంకర్ ఐపీఎస్ ద్వారా చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత మలయాళ సినిమాలలో నటించిన ఆమె 2013లో చమ్మక్ చల్లో సినిమా ద్వారా తెలుగువారిని పలకరించారు. ఆ వెంటనే ఇద్దరమ్మాయిలతో చిత్రంలో ఏకంగా అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం దక్కించుకున్న కేథరిన్.. తర్వాత పైసా, ఎర్రబస్సు, రుద్రమదేవి, బింబిసార, మాచర్ల నియోజకవర్గం, వాల్తేర్ వీరయ్య సినిమాలలో నటించారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు మూవీలో చిరుకు అసిస్టెంట్‌గా నటించి అలరించారు కేథరిన్. జ్వాల అనే క్యారెక్టర్‌లో కేథరిన్ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో టాలీవుడ్‌లో బిజీ అవుతానని కేథరిన్ భావిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులోనే ఫణి అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు. ప్రాజెక్ట్‌ల విషయంలో ఆచితూచి స్పందిస్తోంది కేథరిన్. ఏమాత్రం తొందరపడకుండా మంచి ప్రాజెక్ట్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
కాగా... హైదరాబాద్‌లో ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన ఓ కార్యక్రమంలో హీరోయిన్ కేథరిన్ పాల్గొన్నారు. ఫోటోలకు ఫోజులిస్తూ స్టేజ్ మీదకు వెళ్లారు. అయితే వేదిక మీద మాట్లాడుతుండగా కేథరిన్ కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. తన డ్రెస్ జారిపోయే ప్రమాదం ఉన్నట్లు గ్రహించారు. కాసేపు సర్దుకునేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోవడం తన ఉపన్యాసానికి బ్రేక్ ఇచ్చి.. డ్రెస్ సరిచేసుకున్నారు. అలాగే మీడియా ప్రతినిధుల కోసం ఓ చిన్న మైక్‌ను పెట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











