War 2.. కియారా అద్వానీ బికినీకి కత్తెర.. ఫాన్స్ కు తీవ్ర నిరాశే..
బాలీవుడ్ లో రూపుదిద్దుకున్న భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2 కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వెయిటింగ్ లో ఉన్నారు. కాగా మరో 3 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో వార్ 2 మేకర్స్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ వల్ల బిగ్ షాక్ తగిలింది. సినిమాను సెన్సార్ కు పంపించడంతో బోర్డు సభ్యులు షాకింగ్ గా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..
సెన్సేషన్ గా కియారా అద్వానీ..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టాలెంటెడ్ నటి కియారా అద్వానీ వార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్ సరసన నటించింది. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో విడుదల చేసిన ట్రైలర్ లో కియారా అద్వానీ బికినీ లుక్ లో దర్శనమిచ్చి సెన్సేషన్ గా మారింది. దాంతో ఆమె గ్లామర్స్ సీక్వెన్స్ పై తెగ చర్చ జరిగింది. అయితే తొలిసారిగా కియారా అద్వానీ ఇలా టూపీస్ డ్రెస్ లో కనిపించడం సినిమాపై చర్చకు తావిచ్చింది.

సెన్సార్ బోర్డ్ షాక్..
ఇక సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ వార్ 2 చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులను ప్రారంభించారు. సర్టిఫికెట్ కోసం అప్టై చేయగా షాకింగ్ రిప్లై వచ్చింది. సినిమాలో గ్లామర్ ఎట్రాక్షన్ గా ఉన్న కియారా అద్వానీ బికీనీ లుక్ పై సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కియారా అద్వానీ బికినీ సీక్వెన్స్ ను 50 శాతానికి పైగా కత్తిరించారు. అయితే కియారా అద్వానీ బికినీలో మొత్తం 18 సెకండ్లు మాత్రమే కనిపిస్తుందంట.
ఇక దాన్ని 9 సెకండ్లకే తగ్గించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆదేశించింది. దీంతో ప్రస్తుతం ఆ సీన్లను లేపేసే పనిలో వార్ 2 నిమగ్రమై ఉంది. అయితే కియారా అద్వానీ బికీన్ పోర్షన్ కట్ అవడంతో గ్లామర్ ట్రీట్ మిస్ అయ్యిందని ఫిల్మ్ లవర్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కియారా వార్ 2లో యాక్షన్ స్టంట్స్ తో అదరగొడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ కట్ కియారా అద్వానీకి అభిమానులకు సినిమాపై హైప్ ను పెంచేసింది.
భారీ బడ్జెట్ తో వార్ 2..
2019లో వచ్చిన వార్ చిత్రానికి సీక్వెల్ గా వార్ 2 రూపుదిద్దుకుంది. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో స్పై యూనివర్స్ లో భాగంగా భారీ యాక్షన్ తో వార్ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా నటించారు. 400 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











