వైరల్ అవుతున్న యూ టర్న్ డాన్స్ ఛాలెంజ్.. సమంతలా సెలెబ్రిటీలంతా!
Recommended Video

నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో కీకి ఛాలెంజ్ వైరల్ అయింది. సెలెబ్రిటీలు కికి డాన్స్ చేస్తూ హల చల్ చేశారు. ఈ ఛాలెంజ్ ప్రమాదాలకు కారణం అవుతుండడంతో పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు సమంత యూ టర్న్ ఫీవర్ పట్టుకుంది అందరికి. సమంత నటించిన థ్రిల్లర్ చిత్రం యూ టర్న్ సెప్టెంబర్ 13 న విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ కంపోజ్ చేసిన కర్మ థీమ్ సాంగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లో సమంత డాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టేసింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ 7 మిలియన్ వ్యూస్ పైగా సాధించి దూసుకుపోతోంది.

ఈ సాంగ్ ని యూ టర్న్ కర్మ ఛాలెంజ్ పేరుతో సెలబ్రిటీలు సైతం అనుసరిస్తున్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి, హీరో నవీన్ చంద్ర ఈ సాంగ్ కు డాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కర్మ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంటే, కర్మ ఛాలెంజ్ పేరుతో సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు వైరల్ చేస్తున్నారు. ఈ రకంగా యూ టర్న్ చిత్రానికి మంచి పబ్లిసిటీ లభిస్తోంది.


Click it and Unblock the Notifications











