రకుల్ రచ్చకు సెన్సార్ బ్రేక్.. ఆ సీన్, డైలాగ్‌పై సీరియస్..
Recommended Video
బాలీవుడ్‌లో పాగా వేసేందుకు గత కొద్దికాలంగా అందాల తార రకుల్ ప్రీత్ చాలా కష్టాలు పడుతున్నది. ఎలాగైనా తన ఖాతాలో బాలీవుడ్ హిట్ వేసుకోవాలని కలలు కంటున్న రకుల్ తాజాగా దే దే ప్యార్ దే సినిమాలో గ్లామర్‌ను భారీగా పండించింది. అయితే రకుల్ గ్లామర్ మోతాదును తట్టుకోలేకపోయిన సెన్సార్ బోర్డు భారీగా కత్తెర్లు వేసింది. దాంతో రకుల్ నీరు కారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అజయ్ దేవగన్, టుబుతో కలిసి రకుల్ ప్రీత్ నటించిన దే దే ప్యార్ దే సినిమా మే 16న ప్రీమియర్లతో, 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

మద్యం బాటిల్‌తో రకుల్ రచ్చ
దేదే ప్యార్ దే చిత్రంలోని పాటల్లో రకుల్ ప్రీత్ సింగ్ బోల్డుగా నటించింది. ఈ చిత్రంలోని వడ్డీ షర్బాన్ పాటలో మద్య సేవిస్తూ తెగ చిందులేసింది. చేతిలో మద్య బాటిల్‌తో, నూడుల్ స్ట్రాప్ జాకెట్ ధరించి వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే అలా బోల్డుగా హాట్ హాట్‌గా నటించిన పాటలోని ఓ సన్నివేశంపై సెన్సార్ బోర్డు కత్తెరేసింది. మద్యం బాటిల్ ఉన్న సీన్‌ను కత్తిరించేసి.. ఆ స్థానంలో ఫ్లవర్ బోకేను పెట్టమని సూచించింది.

డైలాగ్‌లపై కూడా అభ్యంతరం
ఇంకా దే దే ప్యార్ దే సినిమాలోని కొన్ని సీన్లపై, డబుల్ మీనింగ్ డైలాగులపై సెన్సార్ కన్నెర్ర జేసింది. ఓ హాట్ సీన్‌లో ఫెర్ఫార్మెన్స్ బెటర్ హోతీ హై అనే డైలాగ్‌ను తొలగించింది. దాంతో ఆ సీన్‌కు సంబంధించిన కొన్ని దృశ్యాలను లేపిసింది. మంజు జీ కే ఆలూ ఓ ఓ.. వహీ అచ్చే హై అనే డైలాగ్‌పై కత్తెర పెట్టింది. ఇలా హాట్ హాట్ సీన్లపై సెన్సార్ కత్తెర్లు పడటంతో చిత్ర యూనిట్ నీరు కారినట్టు సమాచారం.

దే దే ప్యార్ దే వివాదాల్లో
ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి దే దే ప్యార్ దే సినిమా వివాదాల్లో నానుతూ వస్తున్నది. లైంగిక వేధింపుల అరోపణలు ఎదుర్కొంటున్న అలోక్ నాథ్‌ను ఈ సినిమాలో నటించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు అలోక్ నాథ్ ధీటుగా సమాధానం చెప్పారు. ఈ సినిమా తనపై ఆరోపణలు రాకముందు షూట్ చేశామని అలోక్ నాథ్ పేర్కొన్నారు.

సినిమాపై భారీగా అంచనాలు
అశీష్ అనే 50 ఏళ్ల వివాహితుడు (అజయ్ దేవగణ్) తన భార్య (టబు) నుంచి విడిపోయి అయేషా (రకుల్ ప్రీత్) అనే అమ్మాయితో ప్రేమలో పడటం ఈ సినిమా కథ. అకీవ్ అలీ దర్శకత్వం వహించిన దే దే ప్యార్ దే చిత్రంలో జావేద్ జాఫ్రీ, జిమ్మీ ష్రెగిల్, అలోక్ నాథ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











