రెమ్యునరేషన్ ఇవ్వకుండా 2 ఏళ్లుగా నరకం... టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ పోస్ట్
భారతీయ చిత్ర పరిశ్రమలో నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్ల పారితోషికాలు చుక్కలను తాకుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సినిమాకు 300 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే హీరోలు ఇండియాలో ఉన్నారు. ప్రొడక్షన్ కాస్ట్ భారీగా పెరిగిపోతోందని, తమకు నష్టం వస్తోందని, దర్శక నిర్మాతలు మొత్తుకుంటున్నా.. సమ్మెలు చేస్తున్నా, థియేటర్లు మూసేస్తున్నా పరిస్ధితి మాత్రం మారడం లేదు. రెమ్యునరేషన్, ఇతర భత్యాల విషయంలో నిర్మాతల్ని ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారు స్టార్స్.
అయితే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. స్టార్స్‌కి రికార్డ్ స్థాయిలో పారితోషికాలు ఇస్తుంటే... తమ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పించాలంటూ కొందరు తారలు నిర్మాతలు చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా షూటింగ్ పూర్తి చేసి రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు తనకు నిర్మాత రెమ్యునరేషన్ ఇవ్వడం లేదంటూ సదరు నటి ఆరోపిస్తోంది. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆమెకు రెమ్యునరేషన్ ఇవ్వని నిర్మాత ఎవరు? అనేది పరిశీలిస్తే..

ఆ నటి ఎవరో కాదు.. అచ్చ తెలుగు అమ్మాయి చాందినీ చౌదరి. సుహాస్ హీరోగా వచ్చిన కలర్ ఫోటో చిత్రంతో ఈమె తెలుగునాట పాపులర్ అయ్యారు. తన అందం, నటనతో ఒకే ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారారు. విశాఖపట్నంకు చెందిన చాందినీ చౌదరి.. బెంగళూరులోని గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. సినిమాలపై పిచ్చితో ఇంజనీరింగ్ చదువుతుండగానే పలు షార్ట్ ఫిలింస్‌లో నటించారు చాందినీ.
శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో చిన్న పాత్రలో కనిపించారు చాందినీ చౌదరి. తన స్నేహితుడు, హీరో రాజ్ తరుణ్‌తో కలిసి పలు షార్ట్ ఫిలింస్‌లో నటించింది. ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు, వరా ముళ్లపూడిలు చాందినీ నటించిన మధురమ్ అనే షార్ట్ ఫిలింలో ఆమె నటనను చూసి మెచ్చుకున్నారు. అలా కుందనపు బొమ్మ అనే సినిమాలో చాందినీ చౌదరికి అవకాశం దక్కింది. అనంతరం ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం, కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జి తదితర చిత్రాలలో నటించారు చాందినీ చౌదరి.
సుహాస్ హీరోగా వచ్చిన కలర్ ఫోటో హిట్ కావడంతో చాందినీ చౌదరికి అవకాశాలు క్యూకట్టాయి.. సమ్మతమే, గామి, మ్యూజిక్ షాప్ మూర్తి, యేవం తదితర చిత్రాలతో హీరోయిన్‌గా అలరించారు. గతేడాది సంతాన ప్రాప్తిరస్తు మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం చాందినీ చేతిలో ఏ ప్రాజెక్ట్ లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే చాందినీ చౌదరి.. తన సినిమాలు, షూటింగ్స్ ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లను రెచ్చగొడతారు చాందినీ. తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ అవుతోంది.
మోడల్స్, ఆర్టిస్టులు తమకు రావాల్సిన డబ్బు కోసం 60 నుంచి 180 రోజులు ఎందుకు వెయిట్ చేస్తారు ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు చాందినీ చౌదరి స్పందిస్తూ.. నేను కూడా నాకు రావాల్సిన డబ్బు కోసం 2 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను. ఒక సినిమా కోసం నేను ఐదేళ్లు కష్టపడ్డానని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అయితే ఈ సినిమా ఏంటీ? ఆమెకు డబ్బులు ఇవ్వకుండా తిప్పుతోన్న ఆ నిర్మాత ఎవరు. అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications



