Chandini Chowday: "తెలుగు అమ్మాయిలకు సినీ రంగంలో గుర్తింపు లేదు"
అచ్చమైన తెలుగు అమ్మాయి చాందినీ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూసేందుకు చాలా సింపుల్ గా కనిపిస్తూనే.. హోమ్లీగా ఉంటుందీ ముద్దుగుమ్మ. బోల్ట్ సన్నివేషాల్లో అస్సలే నటించ కుండానే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. హోమ్లీ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ తాజాగా షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు సినీ రంగంలో గుర్తింపు లేదంటూ సెన్సేషనల్ కామెంట్లు చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేటుగాడు సినిమాతో తెలుగు సినీ రంగంలో హీరోయిన్ గా అడుగు పెట్టిన ఆమె, కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జి, మను, కలర్ ఫొటో, బొంభాట్, సూపర్ ఓవర్, సమ్మతమే చిత్రాల్లో నటించి తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ముఖ్యంగా 2013లో మధురం అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ విశ్వక్ సేన్ హీరోగా రాబోతున్న గామి సినిమాలో హీరోయిన్ గా నటించింది.

గామి సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ షాకింగ్ కామెంట్లు చేసింది. ఎవరూ ఊహించని టాపిక్ పై మాట్లాడి అందరినీ షాక్ కు గురి చేసింది. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు సినీ రంగంలో గుర్తింపు లేదంటూ చెప్పింది. ఆమె కూడా ఓ తెలుగు అమ్మాయే కావడంతో ఈ కామెంట్లు వైరల్ గా మారాయి. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా... సినీ రంగంలో తెలుగు అమ్మాయిలకు గుర్తింపు లేదనే వార్తను వింటూనే వస్తున్నానని.. చెప్పుకొచ్చింది.
ఈ వార్త నిజంగా దురదృష్టకరం అని.. కానీ ఇంత కాలానికి ఓ తెలుగు అమ్మాయికి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా మంచి మంచి సినిమాల్లో అవకాశాలు కూడా పొందుతుందని తెలిపింది. ఆమె మరెవరో కాదు.. బేబీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వైష్ణవీ చైతన్య. ఈ ముద్దుగుమ్మ కూడా ముందుగా షార్ట్ ఫిల్మ్స్ చేసేది. అక్కడి నుంచి ఇప్పుడు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని.. అనేక సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది.

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఓ తెలుగు అమ్మాయి కావడం, తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. తెలుగు అమ్మాయి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఇప్పుడు సినీ రంగంలో మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. అయితే తెలుగు అమ్మాయి అయిన వైష్ణవీ చైతన్యకు హీరోయిన్ గా గుర్తింపు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని చాందిని చౌదరి చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











