For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛార్మీని కొంటెగా టచ్ చేసిన స్టార్ హీరో.. మీతో ప్రతీక్షణం ప్రత్యేకమే అంటూ పోస్ట్!

    |
    #HBDAmitabhBachchan || అమితాబ్ ఈ రోజు ఇలా వుండటానికి కారణం అదే!

    ఇండియన్ సినిమాలకు హీరోయిజం నేర్పింది బిగ్ బీ అమితాబ్. షోలే, జంజీర్, డాన్ చిత్రాల్లో హీరో పాత్రలకే వన్నె తెచ్చాడు. యాభై ఏళ్ల తన సినీ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ల లాంటి చిత్రాలున్నాయి. కేవలం హిందీ ప్రేక్షకులే కాదు.. అన్ని భాషల సినీ అభిమానులు అమితాబ్‌ను ఇష్టపడుతుంటారు.

    నేడు అమితాబ్ పుట్టినరోజు

    నేడు అమితాబ్ పుట్టినరోజు

    నేడు అమితాబ్ 77వ పుట్టినరోజును జరుపుకున్నారు. అమితాబ్ బర్త్ డే సందర్భంగా.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ నుంచి కూడా ఆయనకు బర్త్ డే విషెస్ వెళ్తున్నాయి. రామ్ చరణ్, సురేందర్ రెడ్డి, పూరి జగన్నాథ్ లాంటి సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.

     మీతో పనిచేయడం..

    మీతో పనిచేయడం..

    సురేందర్ రెడ్డి.. అమితాబ్‌కు విషెస్ చెబుతూ.. ‘మీరెప్పుడు మమ్మల్ని ఇన్ప్పైర్ చేస్తూనే ఉండాలి. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీతో పనిచేయడం నాకెంత ఆనందంగా ఉంది. మీరెప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాల'ని ట్వీట్ చేశాడు.

    లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా..

    లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా..

    ఇటీవలె సైరా సినిమాలో గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. నేటి అమితాబ్ పుట్టినరోజును పురస్కరించుకుని.. రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ఇండియన్ సినిమా లెజెండ్ అమితాబ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు.

    నాటి రోజులు గుర్తుచేసుకున్న పూరి..

    అమితాబ్ బర్త్‌డే సందర్భంగా విషెస్ తెలిపిన పూరి జగన్నాథ్.. నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ‘నాకు అప్పడు 12 ఏళ్లు.. చిన్న ఊరు తునిలో డాన్ సినిమాను చూసేందుకు వెళ్లా.. అక్కడంతా నిండిపోయి ఉంది.. ఎవరికీ భాష రాదు.. అందరికీ తెలిసింది అమితాబ్ అనే ఒక్క పేరే.. లవ్యూ సర్కార్' అంటూ తన ప్రేమను చాటుకున్నాడు.

    బుగ్గ గిల్లిన అమితాబ్..

    బుడ్డా హోగా తేరే బాప్ సినిమాలో అమితాబ్‌తో పాటు ఛార్మీ కూడా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సందర్భంలో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. అమితాబ్‌కు ఛార్మీ విషెస్ తెలిపింది.‘కాలము మారొచ్చు కానీ జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉంటాయి.. మీతో వర్క్ చేసిన ప్రతీ క్షణాలు నాకు ఎప్పుడూ ప్రత్యేకమే'అంటూ తన బుగ్గ గిల్లుతూ ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

    English summary
    Charmi Wishes Amitabh On His Birthday. ‪Times flies but memories stay forever,‪Every moment spent with u amitabh bachchan has been the most special ever.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X