త్రిష, ఛార్మి పెళ్లాడబోతున్నారా? మన దేశంలో చట్టాలు అనుకూలమా?
ఆడ, మగ సాంప్రదాయ బద్దంగా ఏకం అయితే... దాన్ని పెళ్లి అంటారు. అయితే ఈ మధ్య మగ-మగ, ఆడ-ఆడ వివాహాలు సైతం జరుగుతున్నాయి. విదేశాలకు మాత్రమే పరిమితమైన స్వలింగ వివాహాలు క్రమక్రమంగా మన దేశంలో కూడా విస్తరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హీరోయిన్ త్రిష, ఛార్మి వ్యవహారం హట్ టాపిక్ అయింది. నేడు(మే 4) త్రిష పుట్టినరోజు సందర్భంగా ఛార్మి సంచలన ట్వీట్ చేసింది. మరి సరదాగా చేసిందా? లేక సీరియస్‌గా ఆ కామెంట్ చేసిందో తెలియదు కానీ... ఆ ట్వీట్ చూసి సినీ ప్రేక్షకులు విస్తుపోతున్నారు.
మనం పెళ్లి చేసుకుందాం అంటూ ఛార్మి ప్రపోజల్
‘బేబీ ఐ లవ్ యూ.. నేను నా మోకాళ్ల మీద నిల్చుని నీ అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఒకే అంటే మనం పెళ్లి చేసుకుందాం. స్వలింగ వివాహాలను చట్ట పరంగా కూడా అనుమతిస్తున్నారు' అంటూ ఛార్మి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా త్రిష తనకు ముద్దు పెడుతున్న ఫోటో షేర్ చేశారు.

మరి రానా పరిస్థితి ఏంటి?
ఛార్మి చేసిన ఈ ట్వీటుపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఛార్మి... త్రిషను పెళ్లాడితే రానా పరిస్థితి ఏమిటి? అంటూ కొందరు ప్రశ్నించారు. గతంలో రానా, త్రిష మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఫన్నీ మీమ్స్
చార్మి, త్రిష పెళ్లి జరిగితే ఇలా ఉంటుంది అంటూ... నెటిజన్లు ఫన్నీ మీమ్స్ సర్క్యూలేట్ చేస్తున్నారు. ఒక వేళ ఈ ఇద్దరు లేడీస్ పెళ్లి జరిగితే... అనంతరం ఇలా లిప్ లాక్ ముద్దు పెట్టుకుంటారు అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ మీమ్స్ నెటిజన్లను తెగ నవ్విస్తున్నాయి.

ముగ్గురు పిల్లలు, 15 కుక్కలను దత్తత తీసుకోండి
మీ జంట చాలా బావుంటుంది. మీరు ఒకరి కోసం ఒకరు జన్మించినట్లు ఉన్నారు. పెళ్లి తర్వాత ముగ్గురు పిల్లలను, 15 కుక్కలను దత్తత తీసుకోండి, ఆనందంగా జీవితం సాగించండి... అంటూ కొందరు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











