TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
బాగా కష్టపెడుతున్నా, నీ లేడి ఫ్యాన్స్ నన్ను చంపేస్తారేమో.. యంగ్ హీరోపై ఛార్మి ట్వీట్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఫస్ట్ లుక్ తోనే ఈ చిత్రం ఆసక్తిని రేపింది. రామ్ రఫ్ లుక్ లో అదరగొడుతున్నాడు. మాస్ అంశాలని కూడా స్టైలిష్ గా ప్రజెంట్ చేయడంలో పూరి స్టయిలే వేరు. రామ్, పూరి కలయికలో వస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
షూటింగ్ ప్రారంభించడమే పూరి యాక్షన్ సీన్స్ తో మొదలు పెట్టాడు. ప్రస్తుతం రామ్ పై పూరిజగన్నాథ్ కీలకమైన యాక్షన్ సీన్స్ రూపొందిస్తున్నాడు. ఓ ఫ్యాక్టరీలో ఫైట్ సీన్ జరుగుతోంది. రామ్ షూటింగ్ లొకేషన్ లో ఉన్న ఫోటోని ఛార్మి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పరిశ్రమ కావడంతో ఆ ప్రాంతం మొత్తం కాలుష్యంతో నిండి ఉంది. అయినా కూడా రామ్ షూటింగ్ లొకేషన్ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే మాస్క్ ధరించి కూర్చుని ఉన్నాడు.
Most hard working actor 😘 @ramsayz
— Charmme Kaur (@Charmmeofficial) February 8, 2019
Love ur positivity, energy n loooove everything about u 💖💖💖(hope ur female fans don’t kill me for this ) #ismartshankar 😛 #PCfilm #producer #entrepreneur pic.twitter.com/I2zHvP8I44

హీరో రామ్ కష్టపడే తత్త్వం ఉన్న నటుడు. పాజిటివ్ గా ఆలోచించే గుణం, ఎనర్జీ, నీ వ్యక్తిత్వంలోని ప్రతి అంశం నాకు చాలా నచ్చాయి. నిన్ను ఇలా పొగుడుతున్నందుకు నీ లేడీ ఫ్యాన్స్ నన్ను చంపకుండా ఉంటె చాలు అంటూ చార్మి సరదాగా ట్వీట్ చేసింది. ఇస్మార్ట్ శంకర్ చిత్ర విజయం పూరికి, రామ్ కు ఇద్దరికీ చాలా కీలకం. పూరి జగన్నాథ్ కు చాలా కాలంగా సరైన హిట్ లేదు. ఇక ఇటీవల రామ్ నటించిన చిత్రాలు కూడా నిరాశపరిచాయి.