లైగర్ బ్యూటీపై ఛత్రపతి హీరోయిన్ సంచలనం.. నన్ను నిర్ధాక్షిణ్యంగా తీసేసారు..

హిందీ సినిమాకి చెందిన బ్యూటీలు తెలుగు సినిమాలో కూడా నటించడం అనేది ఎప్పుడు నుంచో ఉంది. అలా తెలుగులో సహా తెలుగు హీరోస్ తో రొమాన్స్ చేసిన ఇద్దరు ప్లాప్ బ్యూటీస్ నడుమ రచ్చ ఇపుడు సినీ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. హిందీ సినిమా నుంచి తెలుగులోకి వచ్చి హిట్స్ కొట్టిన హీరోయిన్స్ లెక్క ఎక్కువే ఉంటుంది.

కానీ ప్లాప్ లతో కేవలం ఒక్క సినిమాకి మాత్రమే పరిమితం అయ్యిపోయిన బ్యూటీ ఈ మధ్య ఎవరైనా ఉన్నారు అంటే అది అనన్య పాండే అని చెప్పాలి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ సాహో విలన్ చుంకి పాండే కూతురుగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా అటు హిందీలో కూడా పెద్దగా హిట్స్ లేవు కానీ అలా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో చేసిన లైగర్ తో మాత్రం మంచి లైమ్ లైట్ లోకి వచ్చింది.

chatrapathi beauty sensational comments on liger beauty ananya panday

కాగా ఈ సినిమా ఏదో అవుతుంది అనుకుంటే భారీ డిజాస్టర్ అయ్యి కూర్చుకుంది. ఈ దెబ్బతో మళ్ళీ అనన్య తెలుగు సినిమా వైపు చూడలేదు. ఇక ఈమెనే మరో బాలీవుడ్ బ్యూటీ నటించిన గత సినిమాకి సీక్వెల్ నుంచి ఆమెని తీసేసి అనన్యని పెట్టారని సదరు బ్యూటీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మన టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో ప్రభాస్ ఛత్రపతి ని రీమేక్ చేసి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా ఆ సినిమాలో సాయి శ్రీనివాస్ సరసన నటించిన హీరోయిన్ నుస్రత్ బరుచాకి అనన్యకి నడుమ చిన్న కోల్డ్ వార్ నడుస్తుంది. కాగా బాలీవుడ్ లో పలు సీక్వెల్స్ ఉన్నాయి. వీటిలో హిట్ అయ్యిన ఎంటర్టైనింగ్ సీక్వెల్స్ లో డ్రీమ్ గర్ల్ కూడా ఒకటి. 2019లో ఒక సినిమా 2023లో పార్ట్ 2 లు వచ్చాయి. కాగా ఈ రెండిట్లో కూడా నుస్రత్ బరుచానే హీరోయిన్ గా నటించింది. కానీ ఇపుడు మేకర్స్ ఆమెని కాదని అనన్యని రీప్లేస్ చేయడంపై నుస్రత్ బరుచా అసహనం వ్యక్తం చేసింది.

కనీసం ఆమెని మార్చేస్తున్నట్టు, సినిమా నుంచి తీసేస్తున్నట్టుగా కూడా తనకి తెలియదని అంటుంది. అలాగే మేకర్స్ పాలిటిక్స్ కోసం తనకి అర్ధమయ్యే వాళ్ళు అలా తీసేసినప్పటికీ నేను అడిగితే కావాలనే తీసేసాం అని చెప్తే అది వేరేలా ఉంటుంది అందుకే నేను కూడా అడగలేదు అంటూ నుస్రత్ బరుచా సెలవిచ్చింది. మెయిన్ గా ఒక్క తన పాత్రకి మాత్రమే హీరోయిన్ ని మార్చి మిగతా అందరి రోల్స్ ని అలానే ఉంచడం అనేది మరింత హర్టింగ్ గా అనిపించింది అని చెబుతుంది.

కాగా ఇలా ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోయిన్స్ విషయంలో పరిస్థితులు కొంచెం గరం గరంగానే కనిపిస్తున్నాయి. ఇక ఇవి పక్కన పెడితే నుస్రత్ బరుచా నుంచి లేటెస్ట్ గానే ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తన హారర్ థ్రిల్లర్ సీక్వెల్ ఛోరీ 2 స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమాకి ఒకింత మిక్స్డ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి కానీ మొదటి భాగం మాత్రం మంచి హిట్ అయ్యింది. వీటిని ట్రై ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X