చెక్ బౌన్స్ కేసులో హీరోయిన్.. కోర్టుకు హాజరు కావాలని ఆదేశం

బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ అంటే అంతగా గుర్తు పట్టరేమో కానీ.. బద్రీ సినిమాలో అమాయకంగా కనిపిస్తూ పవన్ కళ్యాణ్ పక్కన నటించిన హీరోయిన్ లేదా నాని సినిమాలో మహేష్ బాబును ఓ ఆట ఆడుకున్న హీరోయిన్ అంటే టక్కున గుర్తు పడతారు. టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో జత కట్టినా అదృష్టం మాత్రం కలిసిరాలేదు ఈ అమ్మడికి.

ఫ్లాపుల హీరోయిన్‌గా ముద్ర..

ఫ్లాపుల హీరోయిన్‌గా ముద్ర..

మహేష్ బాబు సరసన నాని సినిమాలో నటించినా, జూనియర్ ఎన్టీఆర్‌కు జోడిగా నరసింహుడులో కనిపించినా, బాలకృష్ణ సరసన పరవవీరచక్ర చిత్రాల్లో నటించినా అవేవీ కలిసి రాలేదు. పైపెచ్చు.. అవి అతిపెద్ద డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీంతో అమీషా పటేల్ అంటేనే ఆమడ దూరం పోయే పరిస్థితి వచ్చింది.

అప్పుగా తీసుకున్న అమ్మడు..

అప్పుగా తీసుకున్న అమ్మడు..

ఇక టాలీవుడ్ కలిసి రావడం లేదన్న అమీషా.. మళ్లీ బాలీవుడ్‌కే చెక్కేసింది. అక్కడ కూడా ఆశించిన విజయాలు అందుకోలేక అవకాశాలు రాక ఖాళీగానే ఉంటోంది. ఆ మధ్య ఈ భామ ఓ ప్రోడక్షన్ హౌస్ నుండి 10 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమైంది. అకౌంట్లో డబ్బులు లేక చెక్ బౌన్స్ అయిన కేసులో ఇరుక్కుంది.

కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు..

కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు..

దీంతో బ్యాంక్‌లో డబ్బులు లేకున్నా 10 లక్షలకు చెక్కు ఇచ్చిందని.. అప్పు ఇచ్చిన వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారించిన మధ్యప్రదేశ్ కోర్టు అమీషాకు నోటిసులు జారీ చేసింది. అంతేకాదు వచ్చే ఏడాది జనవరి 27లోపు కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.

Recommended Video

#CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
శుభారంభమే అయినా..

శుభారంభమే అయినా..

కాగా అమీషా మొదటగా హృతిక్ రోషన్‌తో కహోనా ప్యార్ హైలో నటించింది. ఆ చిత్రం ఘన విజయం సాధించి శుభారంభమే అనిపించినా.. ఆపై అమీషాకు కష్టాలు మొదలయ్యాయి. టాలీవుడ్‌లో అయితే ఈ అందాల భామకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే వచ్చింది. తాజాగా కోర్టు కేసులు అంటూ మరో చిక్కు వచ్చి పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X