బాలీవుడ్ హీరోయిన్‌కు ఆరు నెలల జైలు శిక్ష
చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటి కోయినా మిత్రాకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఈ కేసు విషయంలో ఆమె స్పందిస్తూ మీడియా ముందుకొచ్చారు. తనను ఇందులో కావాలని ఇరికించారని, ఈ కేసును తాను పై కోర్టులో సవాల్ చేయబోతున్నట్లు తెలిపారు.
కాగా... మోడల్ పూనమ్ సేథి 2013లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు రిజిస్టర్ అయింది. ఫిర్యాదు దారు పూనమ్ సేథికి... వడ్డీ రూ. 1.64 లక్షలతో కలిపి మొత్తం రూ. 4.64 లక్షలు చెల్లించాలని కోర్టు సూచించింది.

ఈ కేసుపై కోయినా మిత్రా మాట్లాడుతూ... 'ఇది కోర్టు మ్యాటర్, ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నందున ఇప్పుడే నేను ఎలాంటి కామెంట్లు చేయలేను. దీన్ని పై కోర్టులో సవాల్ చేస్తాం. ఒక విషయం మాత్రం చెప్పగలను. ఇది మోసపూరితమైన కేసు, నన్ను కావాలని ఇరికించారు' అన్నారు.
కోయినా మిత్రా తన వద్ద నుంచి రూ. 22 లక్షలు తీసుకుందని, తర్వాత డబ్బు తిరిగి చెల్లించడంలో భాగంగా 3 లక్షల చెక్ ఇచ్చిందని, అది బౌన్స్ అయిందని పూనమ్ సేథి ఆరోపిస్తున్నారు. దీనిపై కోయినా మిత్రా పై కోర్టుకు వెళుతున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











