క్యాన్సర్‌తో యువ హీరోయిన్ పోరాటం.. మానవత్వం మరిచి నెటిజన్లు ట్రోలింగ్!

Chhavi Mittal: ఆశ ఉంటే క్యాన్సర్‌ ఉన్నవాడు బతుకుతాడు. భయం ఉంటే అల్సర్‌ ఉన్నవాడు కూడా చచ్చిపోతాడు అన్నట్లు.. చాలామంది ధైర్యంతో క్యాన్సర్‌ తో పోరాటం చేసి విజయం సాధించారు. క్యాన్సర్‌ నుంచి కోలుకుని చాలా మందికి స్ఫూర్తినిస్తున్నారు. అలాగే.. ఓ సినీ నటి క్యాన్సర్‌తో పోరాటం చేస్తూ.. జీవితాన్ని సాగిస్తోంది. కానీ, తరుచు సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్స్ బారినపడుతోంది. తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తనపై వచ్చిన అసభ్య కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు? అసలేం జరిగిందంటే?

ఆ బాధితురాలు ఎవరో కాదు.. బుల్లితెర నటి చవీ మిట్టల్‌ (Chhavi Mittal). బాలీవుడ్‌ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. 'ఘర్‌ కీ లక్ష్మీ బేటియాన్‌, బాందిని, నాగిన్‌.. వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే.. పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ గా నటించింది. బుల్లి తెర సీరియల్స్ తో బిజీబిజీగా ఉండే ఈ అమ్మడు .. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే.. సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా కూడా కొనసాగుతోంది. ఎంతో యాక్టివ్ గా .. చలాకీగా ఉండే చవీ.. రొమ్ము క్యాన్సర్‌ బారిన పడింది. అయినా ఆ ధైర్యపడకుండా.. ఆత్మవిశ్వాసంతో పోరాడుతోంది.

Chhavi Mittal gets trolled for hair loss due to cancer treatment

ప్రస్తుతం చవీ మిట్టల్‌ క్యాన్సర్ కు చిక్సిత తీసుకుంటుంది. తన క్యాన్సర్‌ జర్నీ గురించి ఇన్‌స్టాలో వరుస పోస్టులు పెడుతోందీ ఈ అమ్మడు. అయితే.. క్యాన్సర్‌ చికిత్స వల్ల తాను జుట్టు కోల్పోతున్న తనపై ఎంతో మంది విమర్శలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోకుండా కొంతమంది తనపై ఇష్టం వచ్చినట్టు ట్రోల్‌ చేయడం బాధగా ఉందని పేర్కొన్నారు. తనపై వచ్చిన నీచమైన కామెంట్స్ ను స్క్రీన్‌షాట్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది.

చవీ మిట్టల్‌ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఇలా రాసుకోచ్చింది. 'మానవత్వం చనిపోయిందని మళ్లీ అనిపిస్తోంది.. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ వల్ల జుట్టు రాలిపోతుంటే ట్రోల్ చేస్తున్నారు.. నేను 2022 నుంచి బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. దీనికి 10ఏళ్లు ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌తో నా హార్మోన్‌ చికిత్సకు మూడేళ్లవుతాయి.ఈ ట్రీట్‌మెంట్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్.. డ్రై స్కిన్, డీహైడ్రేషన్, జుట్టు రాలడం.. ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నా.. ఆడవాళ్లకు జుట్టు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముందుగా రొమ్ము క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నా.. ఇలాంటి సమయంలో మీ నెగిటివ్ కామెంట్స్ నన్ను బాధించాయి.'' అని ఛవీ మిట్టల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

"నేను ఇప్పుడు ఇలా పోస్ట్ చేయడానికి కారణం ఉంది. కొంతమంది నన్ను ఇష్టపడరు. కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. జుట్టు రాలిపోతున్న క్యాన్సర్‌ వారియర్‌ను ట్రోల్‌ చేయడానికి మీ మనసెలా అంగీకరించిందో అర్థం కావట్లేదు. అయినా.. ట్రోలర్లు.. మీకు తల నిండా వెంట్రుకలు ఉండి, క్యాన్సర్ లేని జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మీరు ట్రోల్స్ ఫ్రీ లైఫ్ గడపాలని ఆశిస్తున్నాను. అలాగే.. నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నా శరీరాన్ని ఎలా ఫిట్‌గా ఎలా ఉంచుకున్నానో చూడండి" అని నటి ఛవీ మిట్టల్ పోస్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X