బిగ్‌బాస్‌లోకి చీకటి గదిలో చితక్కొట్టుడు హీరోయిన్.. హాట్ బ్యూటీ ఎంట్రీతో రచ్చే!

ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ హిందీ 14వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో అక్టోబర్ 3వ తేదీన ప్రారంభం కానున్నది. ఇప్పటికే ఈ షో టీజర్లు, స్నీక్ పీక్స్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నాయి. జాతీయ స్థాయిలో హిందీలో జరిగే షోలో టాలీవుడ్‌ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే...

మహారాష్ట్రలో పుట్టి టాలీవుడ్‌లోకి

మహారాష్ట్రలో పుట్టి టాలీవుడ్‌లోకి

తెలుగు, తమిళ పరిశ్రమలో అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న నిక్కి తంబోలి మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో 1996లో జన్మించారు. ఔరంగబాద్‌లోనే గ్రాడ్యుయేషన్ వరకు చదువుకొన్నారు. ఆ తర్వాత సినీ, మోడల్ కెరీర్ కోసం ముంబైలో అడుగుపెట్టారు. తెలుగులో చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంలో ఆఫర్ రావడంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

 శృంగార తారగా తెరపైన

శృంగార తారగా తెరపైన

మోడల్‌గా రాణిస్తూ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నిక్కి తంబోలి. చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంలో శృంగారపరమైన పాత్రతో హాట్ హాట్‌గా నటించింది. ఆ తర్వాత కాంచన 3, తిప్పర మీసం చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయత్నాలు ప్రారంభించడంతో తెలుగు సినిమాకు దూరమైంది.

డేటింగ్, అఫైర్ వార్తలతో

డేటింగ్, అఫైర్ వార్తలతో

సినిమాలే కాకుండా డేటింగ్ వార్తలతో నిక్కి తంబోలి మీడియాలో హాట్ హాట్‌గా నిలిచారు. ముంబైకి చెందిన డీజే రోహిత్ గిడాతో అఫైర్‌ వార్తలతో బాలీవుడ్ మీడియాలో ప్రధానంగా కనిపించారు. ఆ తర్వాత పలువురు ప్రముఖుల పేర్లు జోడిస్తూ ఆమె గురించి వార్తలు వచ్చాయి. కానీ వాటికి అంతగా ప్రాధాన్యం దక్కలేదు.

Recommended Video

Thipparaa Meesam Movie Public Talk
 సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ 14లో

సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ 14లో

టాలీవుడ్‌లో సరైన సక్సెస్ సాధించకపోయినప్పటికీ.. శృంగార తారగా క్రేజ్ సంపాదించుకొన్న నిక్కి తంబోలి పేరు అనూహ్యంగా జాతీయ మీడియాలో దూసుకొచ్చింది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ హిందీ 14వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఆమె చేరబోతున్నది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన మేకప్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X