For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సొంత ఫ్యామిలీలో కూడా రేప్ చేస్తామని బెదిరిస్తారు: రకుల్ వివాదంలో చిన్మయి సపోర్ట్!

|

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోపై నెటిజన్ చేసిన వల్గర్ కామెంట్ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు రకుల్ విమర్శల పాలవ్వడానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తనపై నీచమైన కామెంట్ చేసిన వ్యక్తికి తగిన బుద్ది చెప్పే ప్రయత్నంలో అతడి తల్లిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో... పరిస్థితి తిరగబడింది.

చాలా మంది అతడు చేసిన కామెంట్ల గురించి పట్టించుకోకుండా... రకుల్ అతడి తల్లిని ఉద్దేశించి చేసిన కామెంట్లను తప్పుబడుతూ విరుచుకుపడుతున్నారు. మరికొందరేమో నువ్వు అలాంటి డ్రెస్సులు వేస్తే అలాంటి కామెంట్సే వస్తాయంటూ... ఆమెనే టార్గెట్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో రకుల్‌కు మద్దతుగా నిలిచారు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి.

సొంత ఫ్యామిలీలో కూడా రేప్ చేస్తామని బెదిరిస్తారు

సొంత ఫ్యామిలీలో కూడా రేప్ చేస్తామని బెదిరిస్తారు

‘‘అలాంటి వ్యక్తుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారు తమ తల్లిని, చెల్లిని ఉద్దేశించి కూడా నీచంగా మాట్లాడుకుంటారు. సొంత ఫ్యామిలీలోని లేడీస్‌‌ను కూడా రేప్ చేస్తామని బెదిరిస్తారు. కానీ నీలాంటి వారిని మాత్రం బుద్ద భగవాన్‌లా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. నీకు ఎలాంటి ట్రోల్స్ ఎదురయ్యాయో నేను ఊహించగలను.'' అంటూ చిన్మయి తన సపోర్ట్ ఇచ్చారు.

రాహుల్ రవీంద్రన్

రాహుల్ రవీంద్రన్

చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ కూడా రకుల్‌ ప్రీత్‌కు మద్దతుగా ట్వీట్స్ చేశారు. తాను చేసిన ట్వీటుకు మంచి రెస్పాన్స్ వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

అసలు ఈ గొడవ ఎలా మొదలైంది?

అసలు ఈ గొడవ ఎలా మొదలైంది?

రకుల్ ప్రీత్ చిట్టి పొట్టి షార్ట్ ధరించిన ఫోటో ఒకటి ఇటీవల ట్విట్టర్లో పోస్టు చేసింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.... ‘కారులో సెషన్ అయిపోయిన తర్వాత రకుల్ ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయింది' అంటూ బూతు అర్థం వచ్చేలా కామెంట్ పెట్టాడు. ఈ కామెంటుతో హర్టయిన రకుల్.... నీ తల్లి కూడా కారులో ఇలాంటి సెషన్స్ చాలా చేసి ఉంటుంది. ఇలాంటి సెషన్స్ గురించి మాత్రమే కాదు.. కాస్త బుద్ది కూడా నేర్చించమని ఆమెను అడుగు. మనుషులు ఇలాంటి మైండ్ సెట్‌తో ఉన్నంతసేపు మహిళలకు రక్షణ ఉండదు. కేవలం మహిళలకు సమానత్వం, రక్షణ గురించి డిబేట్లు పెట్టినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు, వారి మైండ్ సెట్ మారాలి అంటూ రిప్లై ఇచ్చింది.

అలా ముదిరిన వివాదం

అలా ముదిరిన వివాదం

అయితే రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు భగ్గుమన్నారు. అతడిని తిట్టు ఫర్వాలేదు... కానీ తల్లి ఏం పాపం చేసింది? ఆమెను ఇందులోకి లాగి నీచమైన కామెంట్స్ చేయడం ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కామెంట్స్ చేస్తున్న వారికి రకుల్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. నా నైతిక విలువల గురించి ప్రశ్నిస్తున్న వారు... ఒక ఆడకూతురు గురించి అసభ్యంగా మాట్లాడున్నపుడు ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్లారు? అంటూ మరో ట్వీట్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

English summary
Singer Chinmayi Sripaada extended her support to Rakul Preet Singh. "They wont. They themselves would give maa-behen gaalis. And even give rape threats to the women in the family. BUT will expect you to be Buddha Bhagwan. I can imagine what it can be like to face vicious trolls. This shall pass. [sic]"the singer responded.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more