మార్పింగ్ ఫోటోలతో వేధిస్తున్నారు.. టాలీవుడ్ స్టార్ సింగర్ ఆవేదన

Chinmayi Sripada: టాలీవుడ్ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ( Chinmayi Sripada) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గొంతు వింటే సంగీత ప్రియులు పరవశించిపోవాల్సిందే. ఆమె సమాజంలో ఏ సమస్య ఉన్నా వెంటనే తన గళం విప్పుతుంది. ముఖ్యంగా మహిళల భద్రత, మహిళల హక్కుల విషయంపై ఆవిడ నేరుగా, ధైర్యంగా మాట్లాడుతుంది. అందుకే కొంతమంది ట్రోలర్లు ఆమెను 'ఫెమినిస్ట్'అంటూ టార్గెట్ చేస్తూ విమర్శలు, అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. తాజాగా కొంతమంది దుండగులు చిన్మయి మార్ఫింగ్ ఫొటోలను క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆమె నేరుగా పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో సంచనల ఆరోపణలు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో ట్రోల్స్ గురి కావడం కొత్తేమి కాదు. గతంలో పలుమార్లు ట్రోల్స్ బారిన పడింది. ఇటీవల 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా విడుదల సమయంలో కూడా చిన్మయి, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ లను టార్గెట్ చేస్తూ.. నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. రాహుల్ ఓ ఇంటర్వ్యూలో మంగళసూత్రంపై చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ కు దారితీశాయి. చిన్మయి అటువంటి దాడులకు భయపడకుండా, ట్రోల్స్‌ను ఎదుర్కొంటుంది. చిన్నారులపై జరుగుతున్న దారుణాలు.. ఆ మహిళలు ఆభరణాలు ధరించకపోవడమేనా?" అని సమాధానం ఇవ్వడంతో ట్రోలింగ్ జరిగింది.

Chinmayi Sripada Faces Deepfake Harassment Singer Receives Morphed Nude Image Children Get Death Threats

ఇదిలాఉంటే.. చిన్మయి తాజా ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైబర్ వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్న ఈ కాలంలో ఆమె చేసిన ఈ అవగాహన పిలుపు మహిళలకు, తల్లిదండ్రులకు ఓ సందేశంగా మారింది. బుధవారం సాయంత్రం ఆమెకు ఒక మార్ఫ్ చేసిన న్యూడ్ ఫోటో పంపించడంతో పరిస్థితి అదుపుతప్పింది. వెంటనే ఆమె హైదరాబాదు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తూ.. ఇందులో జరుగుతున్న వేధింపుల గురించి వీడియో రూపంలో వివరించారు. చిన్మయి చెప్పిన ప్రకారం.. ఆమెపై జరుగుతున్న ఆన్‌లైన్ దాడులు గత కొన్ని వారాలుగా తీవ్రంగా పెరిగాయి. ముఖ్యంగా, ఆమె భర్త, దర్శకుడు నటుడు రాహుల్ రవీంద్రన్ ఇటీవల మంగళసూత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ కు దారితీశాయి.

తాజాగా చిన్మయి తనపై వస్తున్న అసభ్యకర దాడుల్ని బయటపెట్టేలా ఒక వీడియోను, స్క్రీన్‌షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సమయంలో సింగర్ చిన్మయి మాట్లాడుతూ.. ఈ రోజు నాకు ఒక పేజీ నుండి మార్ఫ్ చేసిన ఫోటో పంపారు. దానికి సంబంధించిన అకౌంట్‌ను నేరుగా పోలీసులకు ట్యాగ్ చేశాను. చట్టపరమైన చర్యలు ఇప్పుడే జరుగుతాయా లేదా అన్నది పెద్ద విషయం కాదు' అని ఆమె స్పష్టం చేశారు. అయితే ప్రధాన విషయం మాత్రం గత ఎనిమిది నుండి పది వారాలుగా ఒక గ్రూప్ డబ్బులు తీసుకుని తనను, తన కుటుంబాన్ని అసభ్యంగా దూషించడం తమ పని పెట్టుకున్నారంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

'మన సమాజంలోని కొందరు వ్యక్తుల అసలు రూపాన్ని అమ్మాయిలు, వారి కుటుంబాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ వీడియో చేస్తున్నా'అని చిన్మయి పేర్కొన్నారు. 'నన్ను మాత్రమే కాదు... నా పిల్లల్ని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు. నేను ట్విట్టర్ స్పేస్‌లో నా గురించి, నా పిల్లల గురించి అసభ్యంగా మాట్లాడిన వారిపై ఇప్పటికే ఫిర్యాదు చేసాను. మహిళలు పిల్లలు కనకూడదని, కనితే చనిపోవాలని మాట్లాడుతున్నారు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 'నాకు మార్పింగ్ చేసి ఫోటో పంపించారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మహిళలకు జరుగుతూనే ఉన్నాయి' అని చెప్పారు.

ప్రస్తుతం డీప్‌ఫేక్‌లు, ఏఐ ఆధారిత మార్ఫ్ ఫోటోలు పెద్ద ముప్పుగా మారుతున్నాయని చిన్మయి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై ఇలాంటి వీడియోలు, ఫోటోలు ఉపయోగించి మానసికంగా దాడి చేసే ధోరణి పెరిగిందని అన్నారు. "నేను ఇలాంటి వాటికి భయపడే లేదా సిగ్గుపడే వ్యక్తిని కాదు. ఎవరి గురించి అయినా ఇలాంటి ఫేక్ కంటెంట్ తయారు చేయవచ్చు. మహిళలు, యువతులు, తల్లిదండ్రులు ఇలాంటి సందర్భాల్లో వెంటనే లీగల్ చర్యలు తీసుకోవాలి.' అంటూ పిలుపునిచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X