అందుకే ఇండియా విడిచి వెళ్ళిపోయా.. చిరంజీవి హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

మెగాస్టార్ చిరంజీవి సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రిమీ సేన్ (Rimi Sen). తాజాగా ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్‌లలో వరుస సినిమాలతో బిజీగా కనిపించిన రిమీ సేన్, ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండటంతో పాటు దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడ్డారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె భారత్‌ను విడిచి వెళ్లడానికి గల కారణాలను ఓపెన్ చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే..?

2000ల ప్రారంభంలో రిమీ సేన్ పేరు వినిపించని సినిమా ప్రేక్షకుడు దాదాపు ఉండేవాడు కాదు. బాలీవుడ్‌లో 'హంగామా', 'ధూమ్', 'గోల్‌మాల్', 'ఫిర్ హేరా పేరీ', 'జానీ గద్దర్' వంటి హిట్ చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో కూడా చిరంజీవితో కలిసి 'అందరివాడు' సినిమాలో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, రిమీ సేన్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అయినప్పటికీ స్టార్‌డమ్ మాత్రం ఆమెను శాశ్వతంగా వెంటాడలేకపోయింది.

Chiranjeevi Actress Rimi Sen Reveals Why She Left India and Settled in Dubai

కాలక్రమంలో సినిమా అవకాశాలు తగ్గడంతో రిమీ సేన్ తన కెరీర్‌పై కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇక సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల క్రితం దుబాయ్‌కు వెళ్లిన ఆమె, అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి ప్రస్తుతం విజయవంతమైన బిజినెస్‌వుమన్‌గా స్థిరపడ్డారు. దుబాయ్‌లో 'బిల్డ్‌క్యాప్స్ రియల్ ఎస్టేట్ ఎల్‌ఎల్‌సీ' అనే సంస్థను నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిమీ సేన్ మాట్లాడుతూ దుబాయ్ జీవన విధానాన్ని, అక్కడి వ్యాపార వాతావరణాన్ని వివరించారు. 'దుబాయ్ నన్ను ఎంతో ప్రేమతో స్వాగతించింది. ఇక్కడ జనాభాలో దాదాపు 95 శాతం మంది ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడినవారే. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి దుబాయ్ ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది. ఇక్కడ మతభేదాలు లేకుండా అందరూ ప్రశాంతంగా జీవించగలుగుతారు. మసీదులు, దేవాలయాలు అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. అందరూ సౌకర్యంగా జీవించాలని ఇక్కడి పాలకులు భావిస్తారు'అని ఆమె అన్నారు.

అదే సమయంలో భారత్‌లో వ్యాపారం చేయడం తనకు ఎందుకు కష్టంగా అనిపించిందో కూడా రిమీ సేన్ స్పష్టంగా వివరించారు. 'మన దేశంలో ప్రభుత్వాలు మారిన ప్రతీసారీ పాలసీలు మారిపోతుంటాయి. రాత్రికి రాత్రే కొత్త నిబంధనలు తీసుకొస్తారు. దీంతో వ్యాపారం చేయడం చాలా కష్టంగా మారుతుంది. ట్యాక్సుల భారం ఎక్కువగా ఉంటుంది. సంపాదించిన దాంట్లో సగం ట్యాక్సులకే పోతుంది. నా దృష్టిలో ఇప్పుడు ఇండియా వ్యాపారం చేయడానికి అంత అనుకూలమైన దేశం కాదు. అందుకే బిజినెస్ పరంగా సులభంగా ఉన్న దుబాయ్‌ను ఎంచుకున్నాను' అని షాకింగ్ కామెంట్స్ చేసింది. రిమీ సేన్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరలవుతున్నాయి. కొందరు ఆమె మాటలతో ఏకీభవిస్తుండగా, మరికొందరు భారత్‌పై ఆమె చేసిన విమర్శలను తప్పుబడుతున్నారు.

More from Filmibeat

Read more about: tollywood rimi sen chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X