Samantha Pregnancy : సమంత ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ... ఆ ఒక్క మాటతో చిరంజీవి లీక్

టాలీవుడ్ అగ్రనటి సమంత లీడ్ రోల్‌లో బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మా ఇంటి బంగారం. జూన్ 19న విడుదలైన ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ సహా ప్రతిచోటా కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ 50 కోట్ల మార్క్‌కు చేరువైంది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. దీనిని డబుల్ చేస్తూ సమంత గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. రాజ్ నిడిమోరు- సమంత దంపతులు త్వరలో తల్లిదండ్రులు కానున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్‌కి హాజరైన సమంత పొట్ట భాగం కాస్త పెద్దదిగా బేబీ బంప్ మాదిరిగా ఉండటంతో సామ్ గర్భం దాల్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై సమంత కానీ, రాజ్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే సమంత ప్రెగ్నెన్సీ చుట్టూ వస్తోన్న రూమర్స్‌కు మెగాస్టార్ చిరంజీవి ఓ పోస్ట్‌తో చెక్ పెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

Chiranjeevi confirms Samantha pregnancy Megastar s Tweet goes viral

టాలీవుడ్‌లో ఏ సినిమా బాగున్నా ఖచ్చితంగా దానిని ప్రోత్సహించి అండగా నిలబడటంలో మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. సినిమాలను చూసి చిత్ర యూనిట్‌ను ఇంటికి పిలిపించుకుని మరి వారిని సత్కరిస్తుంటారు. ఈ క్రమంలోనే సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీని వీక్షించిన మెగాస్టార్.. ఈ సినిమా టీమ్ మొత్తాన్ని తన ఇంటికి ఆహ్వానించారు. సమంత, రాజ్ నిడిమోరు, నందినీ రెడ్డి, హిమాంక్‌లను సత్కరించారు. అలాగే పెళ్లయ్యాక మొదటిసారిగా తన ఇంటికి వచ్చిన సమంత - రాజ్ నిడిమోరు దంపతులకు చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి కొత్త బట్టలు, బహుమతులు ఇచ్చి ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ వెంటనే మా ఇంటి బంగారం మూవీ గురించి చిరంజీవి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. మా ఇంటి బంగారం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. సమంత నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరం. ఈ విజయానికి సమంత, నందిని రెడ్డి, రాజ్ మరియు మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత, రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు చిరంజీవి.

దాంతో సమంత గర్భవతి అని చిరంజీవి లీక్ చేసి.. ఇప్పటి వరకు చక్కర్లు కొడుతున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు. ఇక రాజ్, సమంత అధికారికంగా తాము తల్లిదండ్రులం కాబోతున్నామని చెప్పడమే తరువాయి. దీనిని బట్టి ఈ ఏడాది డిసెంబర్ నాటికి సమంత ప్రసవం జరిగే అవకాశం ఉంది. చిరంజీవి ట్వీట్ నేపథ్యంలో అభిమానులు సమంత- రాజ్ దంపతులకు విషెస్ తెలియజేస్తున్నారు.

కాగా.. అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత రాజ్ నిడిమోరు దర్శకత్వంలో ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్ వెబ్ సరీస్‌లలో సమంత నటించారు. ఈ సమయంలోనే రాజ్‌- సమంతల పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి మధ్యా ప్రేమాయణం గురించి మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ రాజ్, సమంత్‌లు స్పందించలేదు. ఈ క్రమంలో 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి అమ్మవారి సన్నిధిలో సమంత- రాజ్ నిడిమోరు వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. అతి ప్రాచీనమైన భూతశుద్ధి వివాహం అనే పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నటనను కొనసాగిస్తోన్న సమంత .. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మా ఇంటి బంగారం మూవీని నిర్మించి నటించారు. పెళ్లి తర్వాత తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు గర్భం దాల్చడంతో సమంత వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా సంతోషంగా ఉన్నారు.

Read more about: chiranjeevi samantha raj nidimoru
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X