Sonali Bendre: 50ఏళ్లకు దగ్గరవుతున్నా ఆగని అందాల ఆరబోత... చిరు హీరోయిన్ ఏముందీ బాసూ?

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలు నటించి మెప్పిస్తుంటారు. అలా వచ్చిన ఒప్పటి స్టార్ హీరోయిన్... 50 ఏళ్లకు దగ్గరవుతున్నా... అందం ఏ మాత్రం తగ్గలేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించిన సోనాలీ బింద్రే... 2013 తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో అడపా దడపా యాక్టివ్ గా ఉండే ఈ భామ... తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది సోనాలీ బింద్రే. మహారాష్ట్ర కుటుంబంలో 1975 జనవరి 1న జన్మించింది. ఆమె తండ్రి సివిల్ సర్వెంట్ గా పని చేశారు. ముంబైలో కొంతకాలం చదివిన సోనాలీ... ఆ తర్వాత బెంగళూరులోనూ చదువు కొనసాగించింది. చదువుకొనే రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగేసిన బింద్రే... 'ఆగ్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Chiranjeevi Heroine Sonali Bendre Beautiful PhotoS Viral in social media

ఇక ఆగ్ సినిమాతోనే ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకుంది. తెలుగులో సోనాలీ బింద్రే హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం కృష్ణవంశీ మురారి. ఈ మూవీలో మహేశ్ సరసన క్యూట్ ఎక్సెప్రెషన్స్ తో.. యాక్టింగ్ చేసింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత చిరంజీవితో ఇంద్ర అనే సినిమా చేసింది. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్టుగా నిలిచింది.

Chiranjeevi Heroine Sonali Bendre Beautiful PhotoS Viral in social media

ఇక చిరంజీవితో కలిసి 'ఇంద్ర', శంకర్ దాదా ఎమ్ బీ బీ ఎస్ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్టు అయ్యాయి. ఇక బాలకృష్ణతో 'పలనాటి బ్రహ్మనాయుడు' లో నటించింది. కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత... కృష్ణవంశీ 'ఖడ్గం'లో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా నువ్వు నువ్వు సాంగ్ లో సోనాలిని చూసి మైమరిచిపోయారు సినీ ప్రియులు.

Chiranjeevi Heroine Sonali Bendre Beautiful PhotoS Viral in social media

సోనాలీ బింద్రే... దర్శకనిర్మాత, రచయిత గోల్డీ బెహెల్ ను పెళ్లిచేసుకుంది. వీరికి ఓ అబ్బాయి, పేరు రణవీర్. ఆనందంగా సాగుతున్న సోనాలీ జీవితంలో కేన్సర్ కల్లోలం రేపింది. ధైర్యంగా ఆ వ్యాధిని జయించిన సోనాలి ఎందరికో స్ఫూర్తి కలిగించింది. ఇక ఇప్పుడు 50 ఏళ్లు దగ్గరకు అవుతున్నా.. అందాల వన్నె తగ్గట్లేదు. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఫోటోస్ షేర్ చేసింది.

ఇక ఈ ఫోటోల్లో సోనాలీ బింద్రే... సూపర్ క్యూట్ గా ఉంది. సోనాలి బింద్రే ఐదు పదులకు దగ్గరవుతున్నా.. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంది. సింపుల్ లుక్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X